Advertisement
మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆ కుటుంబం నుంచి వచ్చిన మెగా హీరోలు సైతం సత్తా చాటుకుంటున్నారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబుకి రాజ్యసభ పదవి వస్తుందని తెలిసి కుటుంబంతో పాటకు అభిమానులు సంతోషపడుతున్నారు. కొద్దిరోజుల్లో నాగబాబుని కేంద్రమంత్రిగా చూడబోతున్నారన్న వార్త వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు పదవులకు రాజీనామా చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పేసారు. ఈ రెండు రాజ్యసభ సీట్లు టీడీపీ ఖాతాల్లోకి వెళ్తాయి అని ప్రచారం అవుతోంది.
Advertisement
Advertisement
అనూహ్యంగా రాజ్యసభ పదవికి ఆర్ కృష్ణయ్య కూడా దూరం అయిపోయారు. పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన మూడవ సీటు జనసేనకు ఖాయమని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన తరపున నరసాపురం పార్లమెంట్ స్థానానికి నాగబాబు పోటీ చేశారు రెండో స్థానంలో నిలిచారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి ఇచ్చారు. నాగబాబు సీటు త్యాగం చేశారు కూటమి గెలవడానికి మాత్రం ఎంతో కృషి చేశారు.
Also read:
కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పోస్ట్ ని నాగబాబుకి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు ఎన్డీఏ లో ఏపీ నుంచి టీడీపీతో పాటు జనసేన ఉన్నాయి. TDP 16 పార్లమెంట్ స్థానాలని గెలుచుకుంది జనసేన రెండు స్థానాల్లో గెలిచింది. TDPకి కేంద్రంలో రెండు మంత్రి పదవులు లభించాయి. జనసేనకు మాత్రం ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు అయితే ఇప్పుడు మాత్రం మంత్రి పదవి ఆయనకి ఇస్తారని వార్త వైరల్ అవుతోంది. మరి ఏమవుతుందో చూడాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!