• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » ఇండియాకు రెండో రాజధానిగా విశాఖ ?

ఇండియాకు రెండో రాజధానిగా విశాఖ ?

Published on October 16, 2022 by Bunty Saikiran

Advertisement

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఎయిర్పోర్ట్ ఘటన కేసులో ఇద్దరు జనసేన నేతలు సుందరపు విజయ్ కుమార్, పి.వి.ఎస్.ఎన్.రాజు లను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులలో ఇప్పటివరకు 25 మంది వరకు జనసేన నేతలు అరెస్ట్ అయ్యారు. మరికొంతమంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఎయిర్పోర్టులో మంత్రులు రోజా, జోగి రమేష్ లతో పాటు వైవి.సుబ్బారెడ్డి ల వాహనాలపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులు కార్యకర్తలపై హత్యాయత్నంతో పాటు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

Read Also : Kantara Movie Review : “కంతారా” రివ్యూ..RRR, KGFను మించిపోయిందిగా !

పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే, ఈ ఎపిసోడ్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తాజాగా జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు అధికార వైసిపి పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖపట్నంలో మీరు రాజధానిగా ఏంట్రా బాబు అంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నాగబాబు ట్వీట్ చేశారు. విశాఖ ఇప్పటికే రాజధాని అమ్మ మొగుడు లాంటి సిటీ అని వ్యాఖ్యానించారు.

Advertisement

విశాఖలో ఏపీ పరిపాలన రాజధానిగా కాదు, వీలైతే ఇండియా కి రెండో రాజధాని చేయాలని గర్జించాలని కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. ఏపీ పర్యావరణానికి వైసీపీ ప్రమాదకరమని హాష్ ట్యాగ్ జోడించారు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వారి నుంచి విశాఖపట్నంలో కాపాడాలని పిలుపునిచ్చారు. కాగా, దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. జనసేన దాడిలో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయి అని తెలిపారు. విశాఖ గర్జనను పక్కదారి పట్టించేందుకు తాగుబోతులతో దాడులు జరిపించారని మండిపడ్డారు.

read also : టెస్ట్ మ్యాచ్‌లో లంచ్ & టీ విరామ సమయంలో క్రికెటర్లు ఏం తింటారు?

Vizag ని మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబు . Vizag already రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ.
వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చెయ్యమని గర్జించండి .#YCPisINJURIOUStoAPenvironment
save వైజాగ్ from environment destroyers.

— Naga Babu Konidela (@NagaBabuOffl) October 15, 2022

Related posts:

విడాకులు ఇచ్చి..మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి ! ఆంధ్రా.. విశాఖ.. ఓ గుడ్డు కథ..! పోస్టర్ వార్.. ఎవరూ తగ్గడం లేదు..! పట్టాభి అరెస్ట్.. పెద్ద హైడ్రామా..!

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd