• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » ఎన్టీఆర్, రామ్ చరణ్ ల “నాటు-నాటు” కాదు బ్లాక్ & వైట్ యుగం నాటి పాటకి డాన్స్ చూసారా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల “నాటు-నాటు” కాదు బ్లాక్ & వైట్ యుగం నాటి పాటకి డాన్స్ చూసారా ?

Published on January 22, 2023 by karthik

Advertisement

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆనంద్ మహేంద్ర వ్యాపారంపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పలు రకాల ట్వీట్లు చేస్తూ నెటిజన్లలో ఆసక్తిని కలిగించడమే కాదు వారికి దిశ నిర్దేశం చేస్తుంటారు. తనకి నచ్చిన అంశాలను పోస్ట్ చేయడంతో పాటు.. అప్పుడప్పుడు వివిధ అంశాల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు ఆనంద్ మహీంద్రా. ఈయన పోస్టులు కూడా ఎంతో ఆసక్తిని కలిగించే విధంగా ఉంటాయి.

Read also: “మసూద”లో బుర్కా చాటున ప్రేక్షకులని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

అయితే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీని సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో అంతర్జాతీయంగా ఉన్న దర్శకులు, రచయితలు, పలువురు ప్రముఖులు సైతం జక్కన్న పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమానే కాక ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులను తెగ మెప్పించాయి. ప్రధానంగా ఈ సినిమాలోని నాటు నాటు పాట అయితే విపరీతంగా ప్రజాధరణ పొందింది. ఈ పాట ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్టు లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ పాటకి ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది.

Advertisement

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పాతకాలం నాటి సినిమా క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఈ పాటలో ఇద్దరు హాస్యనటులు లారెల్, హర్డి అచ్చం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాగా రిధమ్ కలుపుతూ డాన్స్ చేశారు. ఆనంద్ మహేంద్ర ఈ వీడియోని షేర్ చేస్తూ.. ” నాటు నాటు పాటను చూస్తే ఎవరూ ఆగలేరు” అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసిన నేటిజెన్లు వీడియో క్లిప్ ను ఎంతో మెచ్చుకుంటున్నారు. అయితే లారెల్, హర్డి.. ఆర్ఆర్ఆర్ డ్యూయో మాదిరిగా ఎనర్జీ చూపించలేకపోవచ్చు.. అలా అని వారు ఏమి చెత్తగా డాన్స్ చేయలేదు” అని పేర్కొన్నారు.

Read also: “వీరసింహారెడ్డి” సినిమాకి ఇదే మిస్ “వాల్తేర్ వీరయ్య” కి ప్లస్ ఇవేనా ?

No one is immune from the catchiness of #NaatuNaatu. Not even inhabitants of the past..😄 L&H may not have the same energy as the #RRR duo but they’re not bad! Enjoy the #FridayFeeling pic.twitter.com/9tMSfAKux5

— anand mahindra (@anandmahindra) January 13, 2023

Advertisement

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd