Ads
ఐసిసి ప్రపంచ కప్ 2023లో శ్రీలంకపై భారత్ రికార్డు స్థాయిలో 302 పరుగుల విజయాన్ని నమోదు చేయడంతో, భారత బౌలర్లు ఐసిసి లేదా బిసిసిఐ నుండి భిన్నంగా ఉండే బంతులను తీసుకుంటున్నారు అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా గురువారం కామెంట్స్ చేసారు. పాకిస్తానీ న్యూస్ ఛానెల్లో, మాజీ పాకిస్తానీ క్రికెటర్, ఐసిసి లేదా బిసిసిఐ భారత బౌలర్లకు మాత్రమే కొన్ని ప్రత్యేక బంతులను అందజేస్తున్నాయని, దీని కారణంగా బ్యాటింగ్ పిచ్‌లపై కూడా భారత బౌలర్లు స్వింగ్ అవుతున్నారని, బీసీసీఐ అందించిన బంతులను మరోసారి పరిశీలించాలి అంటూ రజా కామెంట్స్ చేసారు.
ఇతర జట్లలో ఆడుతున్న బ్యాట్స్మెన్ట్ సంగతి మాకు తెలియదు కానీ, ఇండియన్ జట్టు వారి బౌలింగ్ ప్రారంభించినప్పుడల్లా, షమీ మరియు సిరాజ్ వంటి బౌలర్లు మేము దక్షిణాఫ్రికాలో అలన్ డొనాల్డ్ మరియు మఖాయాలు ఆడుతున్నట్లుగా కనిపిస్తాము. సెకండ్ ఇన్నింగ్స్ కు వచ్చేసరికి బంతులు కూడా చేంజ్ అవుతున్నాయి. ICC ఈ బంతులను ఇస్తున్న విధానం, లేదా థర్డ్ అంపైర్ లేదా BCCI ఇస్తున్న విధానం… ఈ బంతులను చెక్ చేయాలని నేను భావిస్తున్నాను, ”అని రజా అన్నాడు.
Advertisement
ICC Might Give Different Ball to Indian Bowlers thats why they are Getting Seam and Swing More Than Others.Ex Test Cricketer Hasan Raza.#CWC23 #INDvSL pic.twitter.com/7KCQoaz0Qs
— Hasnain Liaquat (@iHasnainLiaquat) November 2, 2023
ఈ కొత్త బంతులు గట్టిగా లేవనీ మరియు వాటిపై అదనపు పూత ఉందనీ పేర్కొన్నాడు. మాజీ పాకిస్తానీ క్రికెటర్ భారత బౌలర్లు, ముఖ్యంగా షమీ మరియు సిరాజ్‌ల అద్భుతమైన ప్రదర్శన చూసి షాక్ అయిన రజా బంతుల్లో ఏదో తప్పు ఉంది అంటూ కామెంట్స్ చేయడంతో నెట్టింట్లో రజా పై ట్రోల్ల్స్ ఎక్కువ అయ్యాయి. నెటిజన్స్ కూడా రజా ను ఓ రకంగా ఆడుకుంటున్నారు. అందుకే కదా మిమల్ని ట్రోల్ చేసేది అంటూ నెటిజన్స్ రజాను ఫుల్ గా ఆడేసుకుంటున్నారు.
Read More:
బోయపాటిని ట్రోల్ చేసేముందు ఆలోచించండయ్యా.. ఆయన చేసిన ఈ మంచి పని గురించి తెలుసుకోండి !
క్రికెట్ ఫీల్డ్ లో ” టైమ్డ్ ఔట్” అంటే అర్ధం ఇదేనా? భారత్ లో ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా?