Advertisement
పెళ్లి అనే బంధం అమ్మాయిల జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఇరవై సంవత్సరాల పాటు ఓ ఇంట్లో పెరిగిన ఆడపిల్లలు ఎన్నో ఆశలతో, భయాలతో కొత్త ఇంట్లోకి అడుగుపెడతారు. అక్కడి ఆచారాలను,పద్దతలును అలవాటు చేసుకుని వారికి తగ్గట్లుగా తమ జీవితాన్ని నడుపుకుంటారు. తమకు సొంతమైన జీవితాన్ని వదిలేసి.. మరొకరి కోసం అన్నట్లు బతకడం చాలా కష్టమైనది. కానీ ప్రేమ, అనురాగాలు ఉన్న చోట అది అంత కష్టంగా అనిపించదు. అందుకే ఆడపిల్లలకు వారి పుట్టిల్లు గుర్తొస్తే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అలా.. పెళ్ళై అత్తారింటికి వెళ్లిన ఓ అమ్మాయి తన పుట్టింట్లో తల్లికి ఎమోషనల్ గా రాసిన లేఖ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ లేఖలో ఏముందో చూడండి.
Advertisement
ఇవి కూడా చదవండి: కేసీఆర్, ఎన్టీఆర్ లే మంచి సీఎంలు… మిగతా అందరూ బ్రోకర్లే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి!
హాయ్ అమ్మా.. మీ వద్ద ఇన్నాళ్లు సంతోషంగా ఉన్న నేను తొందరపడి పెళ్లి చేసుకున్నానని అనిపిస్తోంది అమ్మా. అందరు ఆడపిల్లల్లా నేను కూడా పెళ్లయ్యాక ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ కలలు కన్నాను. నాకోసం రాకుమారుడు వస్తాడని ఆశపడ్డాను. కానీ, పెళ్లి అయ్యాక అర్ధం అయ్యింది. ఇక్క నాకోసం చాలా బాధ్యతలు, త్యాగాలు ఎదురు చూస్తూ ఉంటాయని. నాకు నచ్చినట్లు నిద్రపోవడం, నచ్చినట్లు తిరగడం, సరదాలు ఉండవు అని అర్ధం అయ్యింది అమ్మా.. నాకు ఇంటికి వచ్చేసి నీ దగ్గర పడుకోవాలని ఉందమ్మా.
Advertisement
ఇవి కూడా చదవండి: లోకేష్ ను అరెస్ట్ చేస్తారా? ముందస్తు బెయిల్ పిటిషన్ వెయ్యడానికి కారణం ఏమిటి?
ఇక్కడ నన్ను ఎప్పుడు ఎవరు ఏ పని కోసం పిలుస్తారో అని ఎదురు చూడడమే సరిపోతోంది. నా ఫ్రెండ్స్ తో సరదాగా గడపలేను. నాకు నచ్చిన డ్రెస్ లు వేసుకోలేను. ఇక్కడ ఉన్న బాధ్యతల ప్రకారమే నేను నడ్చుకోవాల్సి వస్తోంది అమ్మా. నాకు నీ దగ్గరకి వచ్చేసి.. నువ్వు వండిపెడితే తినాలని ఉందమ్మా.. కానీ నాకు ఇప్పుడే గుర్తుకొస్తోంది. నువ్వు కూడా ఇలా అందరిని వదులుకుని వచ్చావు కదా. నీ కుటుంబాన్ని ప్రేమించి మా అవసరాలు అన్నీ తీర్చడానికి నువ్వు ఎన్ని త్యాగాలు చేసావో గుర్తొస్తోంది అమ్మ. నిన్నే నేను ఆదర్శంగా తీసుకుంటాము అమ్మా.. కచ్చితంగా నేను నా కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకుంటాను. నువ్వు చేసిన త్యాగాలకు, రాజీలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినే అమ్మా.. అంటూ ఆమె రాసిన ఈ లేఖ నెట్టింట్లో వైరల్ అవుతోంది
ఈసారి 175 స్థానాల్లోనూ వైసీపీ గెలిచి చూపిస్తుందా? జగన్ ధీమా వెనుక అసలు కారణం ఏంటి?