• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. ఎంత బాగుందో!

నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. ఎంత బాగుందో!

Published on October 1, 2022 by Bunty Saikiran

Advertisement

సినీ నటి నిర్మలమ్మ తెలుగు చిత్రసిమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను మొదలుకొని, తర్వాత తరం హీరోలైన చిరంజీవి, రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

Advertisement

 

ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మ ఎక్కువగా తల్లి, బామ్మ, అత్త పాత్రలో నటించి పేక్షకులను మెప్పించారు. మొదటగా పౌరాణిక కథ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్లీ 800 చిత్రాలకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి, రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. నాటకాలు అంటే విపరీతమైన అభిమానం. కానీ కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించేవారు కాదు. కానీ పెదనాన్న మద్దతుతో నాటకాల్లో రాణించింది. అలా ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో నిర్మలమ్మ 1943లో తన 16వ ఏట, గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి తెరపై కనిపించింది. అలా ప్రారంభమైన ఆమె కెరీర్ ముందుకు సాగిపోయింది. సుమారు 1000 చిత్రాల్లో నటించింది నిర్మలమ్మ.

Advertisement

నిర్మలమ్మ కెరీర్ లో ఆమెకు బాగా పేరు తెచ్చిన సినిమాలు మయూరి, సీతారామరాజు. మయూరి చిత్రంలో డ్యాన్స్ చేయాలని తపించే మనవరాలుకి అండగా నిలిచే బామ్మ పాత్రలో జీవించింది నిర్మలమ్మ. ఇక సీతారామరాజు సినిమాలో అయితే ఏకంగా ప్రతినాయక లక్షణాలతో మెప్పించింది. ఈ రెండు సినిమాల్లో ఆమె నటనకు నంది అవార్డులు లభించాయి. చిరంజీవి స్నేహం కోసం సినిమా తర్వాత ఆమె నటించడం మానేసింది. ఆ తర్వాత 2009లో ఆమె మృతి చెందింది.

READ ALSO : బ్రహ్మానందం, AVS మధ్య గొడవలకు కారణం ఏంటి…? ఆ గొడవ అంత దూరం వెళ్లిందా…?

Related posts:

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు! టాలీవుడ్ లో ఎంతో టాలెంటెడ్ యాక్టర్ బెనర్జీ తండ్రి కూడా యాక్టర్ తెలుసా ? ఎవరంటే ? జయసుధ మొదటి భర్త నుంచి భయపడి, పారిపోయి ఎక్కడ తలదాచుకుంది ? 40 ఏళ్లు దాటినా, పెళ్లి చేసుకోకుండా లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్న స్టార్లు !

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd