Advertisement
సహజంగా రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. మన భారతదేశంలో చూసుకుంటే ఎక్కువ శాతం మంది రైలులో ప్రయాణాలను చేస్తూ ఉంటారు, అయితే వారికి తగిన అవసరాలు కూడా ఉంటాయి. సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు. అందుకోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రయాణికుల కష్టాలను చూసి కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఉండాలి అని ఒక కొత్త డివైజ్ ని రూపొందించడం జరిగింది. దాన్ని ఉపయోగించి ఎంతో సులువుగా మరియు ఎంతో తక్కువ సమయంలోనే టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొనుగోలు చేయడం వల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది మరియు టికెట్ తీసుకునే సమయంలో చిల్లర కు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవ్వవు.
Advertisement
Advertisement
అయితే ఈ డివైజ్ లో క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. కంప్యూటర్ లో టికెట్ ధర మరియు ప్రయాణికుల వివరాలను నమోదు చేసిన తర్వాత డివైజ్ లో ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. దాన్ని స్కాన్ చేసి పేమెంట్ అనేది చెయ్యొచ్చు. ఇలా పూర్తయిన తర్వాత టికెట్ ను అందించడం జరుగుతుంది. దాంతో క్యాష్ లెస్ పేమెంట్స్ అనేవి జరుగుతాయి మరియు చిల్లర సమస్యలు తగ్గుతాయి.
Also read:
ముందుగా ఈ పద్ధతిని సికింద్రాబాద్ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లకు మాత్రమే డిజిటల్ పేమెంట్ సదుపాయాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇదే పద్ధతిని అన్ని రైల్వే స్టేషన్ల లో దీనిని అందుబాటులోకి తీసుకువస్తారు అని దక్షిణ మధ్య రైల్వే శాఖ వారు తెలిపారు. కనుక ఈ డిజిటల్ పేమెంట్ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలి అని చెప్పడం జరిగింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!