Advertisement
మన భారతదేశంలో పూజలు పునస్కారాలు అనేది చాలావరకు నమ్ముతారు. ఇందులో భాగంగా బ్రాహ్మణుల కైతే అనేక కట్టుబాట్లు ఉంటాయి. వారి యొక్క ఆహారపు అలవాట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. వీరు మసాలాలు, వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహార పదార్థాలు తీసుకోరు.. మరి ఈ ఆహార పదార్థాలను ఎందుకు నిషేధిస్తారో ఓ సారి చూద్దాం.
ఇవి కూడా చదవండి : Weekly Rashi Phalalu in Telugu : వీక్లీ రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి శుభవార్త
Advertisement
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనం తినే ఆహారాన్ని సామాజికం, రాజాసికం, సాత్వికం అనే మూడు భాగాలుగా విభజించారు. వారు తినే ఆహారాన్ని బట్టి వారి యొక్క గుణగణాలు ఆలోచనలు మారుతూ ఉంటాయి. మసాలాలు ఉల్లి వెల్లుల్లి రాజా సిక గుణానికి చెందింది. ఈ ఆహారాలు తినడం వల్ల మీకు సరైన ఆలోచనలు రాకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
అందుకే పూజలు వ్రతాలు చేసే సమయంలో నిష్టత ఏకాగ్రతతో ఉండాలి కాబట్టి మసాలా ఉల్లి వంటి ఆహారాలను నిషేధిస్తారు. మరొక కారణం ఏంటంటే ఉల్లి, వెల్లుల్లినీ పండించే కొన్ని ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉంటాయని, అలాంటి వాటిని తిని పూజలు చేయడం తప్పుగా భావిస్తారు. అందుకే పూజలు వ్రతాలు చేస్తున్న సమయంలో ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని పెద్దలు అంటుంటారు.
Advertisement
ALSO READ: శనివారం ఇనుము, నూనె, నువ్వులు ఎందుకు కొనరో తెలుసా..?