Ads
ప్రస్తుతం క్రికెట్ అభిమానులు వరల్డ్ కప్ పోరులో మునిగితేలుతున్నారు. అన్ని జట్లు పోటా పోటీగా తలపడుతున్నాయి. ఈ సారి వరల్డ్ కప్ పోరులో పాకిస్తాన్ సెమీస్ వరకు వస్తుందో లేదో తెలియదు కానీ.. ఒకవేళ పాకిస్తాన్ సెమీస్ కు వస్తే మాత్రం ముంబైలో ఆడదు.. అంటూ బీసీసీఐ స్పష్టం చేసింది. సెమీస్ కి వస్తే మాత్రం కచ్చితంగా టీం ఇండియా తోనే ఆడుతుంది. భారత్ నెదర్లాండ్స్ తో తమ చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయినప్పటికీ అగ్రస్థానంలోనే ఉంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ లో ఆడడం ఖాయం అయ్యింది.
ఇది ఇలా ఉంటె పాకిస్థాన్ మాత్రం నాలుగో స్థానం కోసం పోరాడుతోంది. ఒకవేళ పాకిస్తాన్ కూడా సెమీస్ కు రీచ్ అయితే.. టాప్ లో ఉన్న ఇండియా జట్టుతోనే మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ఈ మ్యాచ్ వేదిక మారబోతోంది. షెడ్యూల్ ప్రకారం మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో ముంబై లో జరగాల్సి ఉంది. అయితే.. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకున్న పిసిబి ముంబై లో పాకిస్థాన్ మ్యాచ్ లు ఆడకూడదని అభ్యర్ధన చేసింది. ఈ అభ్యర్ధనని మన్నించిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement
ఒకవేళ పాకిస్థాన్ సెమీస్ కు చేరుకొని భారత్ తో సెమి ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి వస్తే ఆ మ్యాచ్ కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లు ముంబైలో తలపడతాయి. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 15 వ తేదీ వాఖండేలో మొదటి సెమి ఫైనల్, రెండవ సెమి ఫైనల్ 16 వ తేదీన కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు రెండు మూడు స్థానాల్లో ఉండి సెమి ఫైనల్స్ కు సిద్ధం కాగా.. టాప్ లో ఉన్న భారత్ తో ఆడడానికి పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి.
Read More:
Jigarthanda DoubleX Movie Review: జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్
Motivational Bible Quotes in Telugu and తెలుగు బైబిల్ కోట్స్
Japan Movie Review: జపాన్ లో కార్తీ అదరకొట్టేసాడా..? జపాన్ హిట్టా, ఫట్టా..?