Ads
సాధారణంగా రైలులో దొంగలుండటం సహజం. ఓ దొంగ మహిళ పర్సు కొట్టేశాడు. కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకడానికి ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో అతడిని గుర్తించిన ప్రయాణికులు.. కిటికిలోంచి పట్టుకున్నారు. కొద్ది కిలోమీటర్ల వరకు దొంగ అలాగే వేడాలాడాడు. చివరకీ ఓ జంక్షన్ వద్ద పోలీసులకు అప్పగించారు. బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం కటిహార్ నుంచి సమస్తిపుర్ వెళ్తున్న రైలులో ఓ మహిళ పర్సు చోరీకి గురైంది.
Advertisement
కిటికీలో నుంచి పర్సును తీసుకున్న దొంగ… తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకబోతుండగా తోటి ప్రయాణికులు గమనించారు. దీంతో దొంగ చేతులను కిటికీ లోపలి నుంచి గట్టిగా పట్టుకున్నారు. అతడికి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో కొన్ని కిలోమీటర్లు అలాగే వేలాడుతూ ప్రయాణించాడు. చివరకు రైలు బచ్వారా జంక్షనుకు చేరుకున్న తర్వాత ఆర్పీఎఫ్ పోలీసులకు అతణ్ని అప్పగించారు. ఆ దొంగను హేమంత్ కుమార్‌గా గుర్తించిన పోలీసులు.. అతడి వివరాలను తీసుకుని విడిచిపెట్టారు. రైలు కిటికీకి దొంగ వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bihar News: Thief Hangs Outside Window Of Speeding Train In Begusarai. The Person Was Allegedly Escaping After Stealing a Woman’s Purse In The train. #MyIndia pic.twitter.com/kLKmanKGdg
— Fast Mail (@fastmailnews) September 3, 2023