Advertisement
మూవీ ఇండస్ట్రీలో బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేసిన సినిమాలన్నీ ఆయనను ఉత్తమ పొజిషన్లో నిలబెట్టాయి. పైగా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు బాలయ్య. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నా కూడా చాలా తక్కువ సమయంలో సార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. మొదట్లో ఈయన చేసిన ఏడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్నాయి. పవర్ స్టార్ గా మారిపోయారు.
Advertisement
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలైతే ఫ్లాప్ అవుతాయి లేదంటే ఇండస్ట్రీ హిట్లుగా మిగిలిపోతాయి తప్ప యావరేజ్ గా ఉండవు. మొత్తానికి వీళ్లిద్దరూ స్టార్ హీరోలుగా ముందుకు వెళ్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ అశ్విని దత్ చాలా ప్రయత్నం చేశారట. ఈ సినిమాకి టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాలని ట్రై చేశారు. కానీ కుదరలేదు.
Advertisement
Also read:
దీనికి కారణం ఏమైనా కూడా ఒక మంచి కాంబినేషన్ లో సినిమా మిస్ అయింది అని చెప్పొచ్చు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో నటించినప్పటికీ బాలయ్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా పడితే పక్కా హిట్ అయ్యేదే అని అభిమానులు అంటున్నారు. మరి భవిష్యత్తులో అయినా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!