Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో నిలుస్తూ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్లోకి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. ఆ తర్వాత సుస్వాగతం, తొలిప్రేమ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి పవన్ కళ్యాణ్ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ప్రజా సేవ చేయాలని 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.
Advertisement
అయితే ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ కి కేవలం కొద్ది మంది మాత్రమే స్నేహితులు ఉన్నారు అలాంటి స్నేహితుల్లో ఒకరు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. 20 ఏళ్లగా వీరిద్దరి స్నేహబంధం అలానే కొనసాగుతోంది. అప్పట్లో సినిమాలకు సంబంధించిన విషయాల్ని మాట్లాడడానికి చిరంజీవి ఇంటికి వెళ్లేవారు ఆనంద్ సాయి, ఆయన తండ్రి. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ ఆనంద్ సాయికి మధ్య పరిచయం ఏర్పడింది. చివరిసారిగా ఎవడు చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా ఆనంద్ సాయి పని చేశారు పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల మూవీకి కూడా కొన్ని స్కెచ్ లు వేశారు. పవన్ కోరిక మేరకు చాలా కాలానికి హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలకు కూడా పనిచేస్తున్నారు ఆనంద్.
Also read:
- హరిహర వీర మల్లు ఎవరు..? ఆయన ఏం చేసారంటే..?
- ఈవారం ఓటీటీ ల్లో రిలీజ్ అవ్వబోతున్న.. సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..!
- హీరో ఆర్యన్ రాజేష్ కెరియర్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటి..?