Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ బిజీ గా ఉంటున్నారు. ఒక పక్క రాజకీయాలు మరొక పక్క సినిమాలను మ్యానేజ్ చేయడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఓజీ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్.
ఈ నెల మొత్తం వారాహి యాత్ర మొదటి విడతని పవన్ కళ్యాణ్ పూర్తి చేయబోతున్నారు. అయితే నిన్న జరిగిన పిఠాపురం వారాహి యాత్ర లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పైగా సినిమాలు విషయానికి వస్తే నేను నా తోటి హీరోలని ఇష్ట పడతాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Advertisement
రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి సినిమాలను నేను మిస్ అవ్వను అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ విషయాలు వైరల్ అయ్యాయి ఇది వరకు కూడా పవన్ కళ్యాణ్ తనకి ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలు అంటే ఇష్టమని చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ కి ఈ హీరోలు అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది.
ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కి మహేష్ బాబు సినిమాలంటే ఇష్టం అని తెలుస్తోంది. మహేష్ బాబు నటన అంటే ఆమె కి చాలా ఇష్టమట. మహేష్ భార్య నమ్రత ఈమె కి మంచి ఫ్రెండ్ కూడా ఇద్దరూ క్లోజ్ గానే ఉంటారు. క్రిస్మస్ కి మహేష్ కి నమ్తర కి అన్నా లెజినోవా గిఫ్ట్స్ ని కూడా పంపిస్తూ ఉంటారు. మహేష్ అంటే తనకి ఇష్టం అని తెలియడం తో మహేష్ అభిమానులు ఆనందంగా ఫీల్ అయ్యారు.
Also read:
మగధీర లో ఆ సీన్ ని చిరు నుండే కాపీ కొట్టారు.. రాజమౌళి కూడా ఒప్పుకున్నారు..!
సీక్రెట్ గా ఒకరితో లవ్.. మరొకరితో పెళ్లి.. ఆఖరికి..?
చిరంజీవికి డూప్ గా 30 ఏళ్లుగా ఈ వ్యక్తి చేస్తున్నారు.. అతనెవరో మీరు చూడండి..!!