Advertisement
Pawan Kalyan Movies: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు వారి అభిమానులు. అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు. అయినా ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.
READ ALSO : రాజమౌళి అమ్మగారు చిరంజీవికి బంధువు అని తెలుసా..? ఎలాగంటే..?
ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు తన జనసేన పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలతో ముందుకు పోతున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు ఉన్నారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబును మామూలు హీరో నుండి సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమాలో అతడు మరియు పోకిరి.
Advertisement
ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ చేయాల్సినవి అని త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ ఎన్నో సందర్భాలలో తెలిపారు. అప్పుడు అలా పవన్ కళ్యాణ్ వదిలేసిన ఈ సినిమాలు మహేష్ బాబు వద్దకు వెళ్లాయి. ఆయన సూపర్ స్టార్ అయిపోయాడు. రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వదులుకున్నవి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, మిరపకాయ్ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి.
Read also: మన స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకునే సమయానికి వీరి ఏజ్ ఎంతంటే ?
ఇక లవర్ బాయ్ తరుణ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా ‘నువ్వే కావాలి’. ఆ రోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. ఈ మూవీ కూడా పవన్ కళ్యాణ్ చేయాల్సిందే కానీ కొన్ని కారణాలవల్ల పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్నారు.
Advertisement
Read also: అన్ని సినిమాలు, ఒకటే పాత్ర! ఈ వ్యక్తిని గుర్తుపట్టారా? అతను ఎవరంటే?