• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » రైతులకు సాయంలో కూడా కులమేనా?

రైతులకు సాయంలో కూడా కులమేనా?

Published on March 30, 2023 by sasira

Advertisement

ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయని అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కౌలు రైతులు సుమారు 3 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డా వైసీపీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Pawan Kalyan With Formers Rights Organisation

రైతులకు సాయం చేయడంలో కూడా కులం కోణం చూడటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కౌలు రైతుల కడగండ్లకు ప్రభుత్వ విధానాలే కారణమని స్పష్టం చేశారు. రైతు స్వరాజ్య వేదిక క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి కౌలు రైతుల స్థితిగతులపై రూపొందించిన నివేదికను పరిశీలించి.. వారి ప్రయత్నాన్ని పవన్‌ అభినందించారు. రైతాంగం కష్టాలపై త్వరలోనే రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిద్దామని తెలిపారు.

Advertisement

“రాష్ట్రంలో పండే వరి పంటలో 80 శాతం కౌలు రైతుల సేద్యం నుంచి వస్తున్నదే. ఇంతటి కీలకమైన పంట వేసి నష్టాల పాలై, అప్పులు తీర్చలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. వరితోపాటు మిర్చి, పత్తి లాంటి పంటలు వేసినవారూ నష్టపోతున్నారు. రైతు భరోసా యాత్రల సందర్భంలో కౌలు రైతుల కుటుంబాల ఆవేదన నేరుగా తెలుసుకొంటున్నాను” అని అన్నారు.

Advertisement

ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకూ చేసిన రైతు భరోసా యాత్రల్లో 8 జిల్లాల్లో 700కి పైగా కౌలు రైతు కుటుంబాలకి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన భరోసా కలిగిస్తుందని తెలిపారు. జనసేన పార్టీ తొలి నుంచి రైతు పక్షం వహిస్తోందని.. వరి పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోతే గతంలో రైతు సౌభాగ్య దీక్ష చేశామని గుర్తు చేశారు. అదే విధంగా నివర్‌ తుఫాన్‌ సమయంలో నష్టపోయిన రైతుల కోసం నిలబడ్డామని వివరించారు నాదెండ్ల.

Related posts:

కోటంరెడ్డి ఎంతకీ తగ్గడం లేదు! లోకేష్ యాత్రలో స్పెషల్ పర్సన్..! Puttaparthi-Politicsపుట్టపర్తి మే సవాల్! రాళ్ల దాడి చుట్టూ ఏపీ పాలిటిక్స్

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd