• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Quotes and Quotations » Podupu Kathalu, Riddles in Telugu with Answers: తెలుగు పొడుపు కథలు!

Podupu Kathalu, Riddles in Telugu with Answers: తెలుగు పొడుపు కథలు!

Published on February 19, 2025 by mohan babu

Advertisement

మనందరి చిన్నతనం లో నయనమ్మో, అవ్వ, తాతలని పొడుపు కథలు Podupu Kathalu  ని అడిగి తెలుసుకునే వారు. అంతే కాదు మన చిన్న తనంలో స్కూల్ లో కూడా ఇవన్నీ మనం చదునుకొని ఉండే ఉంటాము. పొడుపు కథలు మరియు వాటి జావాబులు చెప్పడం అందరికి తేలిక కాకపోవచ్చు. ఇక్కడ మీకోసం ఎన్నో పొడుపు కథలని ఇచ్చాము మీ తెలివి తేటలకి మీకో పరీక్ష లాంటిదే చూద్దాం ఎందరు చెప్పగలరో..!కాలక్షేపం కోసం అడిగే చిన్న చిక్కు ప్రశ్నలను పొడుపు కథలు Podupukathalu అంటారు.
Popular Articles: Telugu riddles with answers (పొడుపు కథలు) Answers and Images సుడోకులు, పజిల్స్

Advertisement

Best and Popular Podupu Kathalu in Telugu with Answers

నాలో దేశాలు ఉంటాయి కాని మనుషులు ఉండరు, సముద్రాలు ఉంటాయి కాని నీల్లు ఉండవు, రోడ్లు ఉంటాయి కాని వాహనాలు ఉండవు, ఎవరు నేను?
జవాబు: ప్రపంచ పటము

తెల్లని పోలీసుకు నల్లని టోపీ.
జవాబు: అగ్గిపుల్ల

చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది.?
సమాధానం :
ఉల్లిపాయ జాన కాని జాన, ఏమి జాన.?
సమాధానం :ఖజాన

కిట కిట తలపులు కిటాయి తలపులు ఎంత మూసిన తెరచిన చప్పుడు కావు ఏంటవి?
జవాబు: కనురెప్పలు

తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది.?
సమాధానం :వేరుశెనగ కాయ

లాగి విడిస్తేనే బ్రతుకు.?
సమాధానం :ఊపిరి

మూత తెరిస్తే, ముత్యాల పేరు.?
సమాధానం :దంతాలు

మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు.?
సమాధానం :తేనె పట్టు

మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ.?
సమాధానం :లవంగ మొగ్గ

పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు.?

సమాధానం :పత్తి పువ్వు.

పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే.?
సమాధానం :
దీపం

వీటిని కూడా చదవండి: Birthday Wishes and Quotes in Telugu 

Bhgavadh Gita Slokas and Quotes in Telugu

పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు.?
సమాధానం :
సూర్యుడు

 ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం.?

సమాధానం :
తేనె పట్టు

రసం కాని రసం, ఏమి రసం.?
సమాధానం :
నీరసం

మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన.?
సమాధానం :
పాలు, పెరుగు, నెయ్యి

రాణాలనే మించిన రణం, ఏమి రణం.?
సమాధానం :
మరణం

రంగం కాని రంగం, ఏమి రంగం.?
సమాధానం :
వీరంగం

మత్తు కాని మత్తు, ఏమి మత్తు.?
సమాధానం :
గమ్మత్తు

అందరినీ పైకి తీసుకుకెళ్తుంది, కాని తాను మాత్రం పైకి వెళ్ళదు.?
సమాధానం :
నిచ్చెన

 

ముడ్డి పిసికి, మూతి నాకుతారు.?
సమాధానం :
మామిడి పండు

టూరు కాని టూరు, ఏమి టూరు.?
సమాధానం :
గుంటూరు

మోదం కాని మోదం?
సమాధానం :
ఆమోదం

రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది.?
సమాధానం :
ఉత్తరం

కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి.?
సమాధానం :
సీతాకోక చిలుక

రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు.?
సమాధానం :
మంగలి

రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన.?
సమాధానం :
తాటి చెట్టు

రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది.?
సమాధానం :
ఎండ, వాన, చలి

రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు’?
సమాధానం :
తేలు

అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది.?
సమాధానం :
దీపం వత్తి

Advertisement

కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు.?
సమాధానం :
మురళి

ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు.?
సమాధానం :
ఉల్లి

సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది.?
సమాధానం :
శంఖం

చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ.?
సమాధానం :
కజ్జికాయ

వాలం ఉంది కాని కోతిని కాదు, నామముంటుంది కాని పూజారిని కాదు.?
సమాధానం :
ఉడత

చారల చారల పాము , నునువైన పాము , చక్కటి పాము మరియు వ్రేలాడే పాము ..ఏంటది ?

జవాబు : పొట్లకాయ

ఆటకత్తే ఎప్పుడు లోనే నాట్యం చేస్తూ ఉంటుంది.. ఏంటది ?

జవాబు : నాలుక

తడిస్తే గుప్పెడు మరియు ఏండితే బుట్టెడు… ఏంటది..?

జవాబు : దూది

also read:ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

Podupu kathalu in Telugu with Answers and Pictures

podupu kathalu in telugu podupu kathalu in telugu podupu kathalu in telugu podupu kathalu in telugu podupu kathalu in telugu podupu kathalu in telugu podupu kathalu in telugu podupu kathalu in telugu podupu kathalu in telugu podupu kathalu in telugu podupu kathalu in telugu with answers and pictures పొదుపు కథలు podupu kathalu in telugu 2023 with answers పొదుపు కథలు పొదుపు కథలు

 

Latest Comedy Podupu Kathalu in Telugu Riddles with Answers

  1.  అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు.
    ఉల్లిపాయ
  2.  అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది. తైతక్కలాడింది.
    చల్లకవ్వం
  3.  అన్నేసి చూడు, నన్నేసి చూడు అన్నది ఎవరు?
    ఉప్పు
  4.  ఆకారం పుష్టి నైవేద్యం నష్టి
    పుచ్చకాయ
  5.  ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం.
    కరివేపాకు
  6.  అగ్గిమీద గుగ్గిలం అటూ యిటూ తప్పితే అరక్షణం.
    అప్పడం
  7. ఆకుపుల్లన కాయచప్పన,
    శనగకాయ
  8. ఆకులేని చెట్టు గలగల మంది.
    సంత
  9. ఆకులు లేకనే ప్రాకెడి తీగ,
    కరెంటుతీగ
  10.  ఇంటిలో మొగ్గ, బయట పూవు
    గొడుగు
  11. ఇచ్చేవాడు అతనే, పుచ్చుకొనేవాడు అతనే.
    చేయి
  12. ఇల్లంతా వెలుగు బల్లక్రింద చీకటి.
    దీపం
  13. ఇల్లంతా నాకి మూలకూర్చుంటుంది.
    చీపురు
  14. ఈకలు లేని కోడి ఇల్లెక్కింది.
    సొరకాయ
  15.  ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం.
    ముక్కు
  16. ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే.
    కుక్క
  17. ఊరంతా తిరిగినా గడవముందొచ్చి ఆగుతాయి.
    చెప్పులు
  18. ఊరందరికి ఒకే దీపం.
    చంద్రుడు
  19. ఎగిరిన ఎగురును, ఉరికిన ఉరుకును.
    నీడ
  20. ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంతకు పెరిగేది.
    విద్య
  21. ఎందరు ఎక్కినా విరగని మంచం అంద దీని మోసే మంచం.
    భూమి
  22. ఏడిస్తే ఏడుస్తుంది. నవ్వితే నవ్వుతుంది.
    అద్దం
  23. ఏరంతా ఇసుక బొక్కలే.
    పట్టెమంచం
  24. ఐదుగురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు
    చిటికెన వ్రేలు
  25. ఐదువేళ్ళ అప్పడం గోడమీద కూర్చుంది.
    పిడక
  26. ఒక గుద్దుకు ఇద్దరు పిల్లలు బయట పడ్డారు.
    వేరుశనగ కాయ

Related posts:

Lingashtakam Lyrics in Telugu: తెలుగు లింగాష్టకం..! బ్రహ్మమురారి సురార్చిత లింగంLingashtakam Lyrics in Telugu and Bramamurari Surachitha lingam lyrics: తెలుగు లింగాష్టకం..! Bible Quotes and Jesus Quotes in TeluguBible Quotes and Jesus Quotes in Telugu బైబిల్ సూక్తులు తెలుగు వేసవిలో కూలరా…? ఏసినా…? రెండింటిలో ఏది బెస్ట్…? love-and-attractionsప్రేమకి అట్రాక్షన్ కి మధ్య ఉన్న తేడాలు ఇవేనా ? నిజంగా లవ్ యట్ ఫస్ట్ సైట్ ఉందా ? తప్పక తెలుసుకోండి !

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd