Ads
రాజమౌళి దర్శకత్వం వహించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా స్థాయి ఉన్నత శిఖరాలకు తాకింది. అయితే ఈ సినిమా దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ మరియు హీరోలు ఆస్కార్ వేడుకల్లో సందడి చేశారు. ఇక మన దేశం తరపున ఆస్కార్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట వేడుకలో ఎక్కడ నిర్మాత దానయ్య కనిపించలేదనేది అందరూ చర్చించుకున్నారు.
READ ALSO : Das Ka Damki Movie Review in Telugu: విశ్వక్ సేన్ ” దాస్ కా దమ్కీ” రివ్యూ & రేటింగ్
సోషల్ మీడియాలో కొందరు రాజమౌళి నిర్మాత డివివి దానయ్యను కూరలో కరివేపాకుల తీసి పక్కన పెట్టినట్టు చెప్పుకొచ్చారు. తాజాగా ఆస్కార్ వేడుకలకు తాను ఎందుకు రాలేకపోయాను అనే విషయమై ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు నిర్మాత డివివి దానయ్య. తాను ముందు నుంచి పబ్లిసిటీకి దూరంగా ఉండే వ్యక్తిని అన్నారు. అందుకే ఆస్కార్ వేడుకలకు వెళ్లలేదని విషయాన్ని స్పష్టం చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళితో చేసిన ప్రయాణాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 2006 నుంచి రాజమౌళితో ప్రయాణం చేస్తున్నాను.
Advertisement
READ ALSO : భార్య కంటే కూడా భర్తే ఎందుకు వయసులో పెద్దవారై ఉండాలి?
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు చిరంజీవి పెట్టుబడి పెట్టిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అలాంటి న్యూస్ ఎలా రాస్తారో అర్థం కాదన్నారు. ఈ సినిమాకు రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఆస్కార్ వేడుకకు రాజమౌళి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారనే విషయమై తనకు తెలియదన్నారు. తాను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాడు లేదన్నారు. ఇక్కడ ప్రచారం చేసినట్టే అమెరికాలో జక్కన్న ప్రచారం చేయడానికి కొంత ఖర్చు చేశారు. అది ఎంత ఖర్చు చేశారనేది తెలియదన్నారు. సినిమా ప్రాఫిట్ అంత రాదు. ఆస్కార్ కి అన్ని కోట్లు ఎవరు ఖర్చు పెడతారన్నారు దానయ్య.
READ ALSO : Rangamarthanda Review Telugu: రంగమార్తాండ సినిమా రివ్యూ & రేటింగ్