Advertisement
Promissory Note Format Telugu: ఎవరికైనా సహజంగా వడ్డీకి డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం సర్వసాధారణం. ప్రస్తుత కాలంలో మనిషి మాట కన్నా ఒక ప్రమిసరీ నోటుకు అధిక ప్రాధాన్యత ఉంది. అయితే ఈ ప్రామిసరీ నోటు రాయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ప్రామిసరీ నోట్లపై నగదు ఇచ్చే వారి వివరాలు, తీసుకునే వారి వివరాలు, నగదు మొత్తం, వడ్డీ రేటు, సాక్షి సంతకాలు వంటివి చూస్తూ ఉంటాం. ప్రామిసరీ నోట్ పై ఒక స్టాంపు కూడా అంటిస్తారు. ఇంతవరకు మనకు తెలిసిన విషయమే కానీ.. ఈ ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు జరిగినా ఈ ప్రామిసరీ నోటు చెల్లదు. అలా ప్రామిసరీ నోటు రాయించుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
Promissory Note Telugu

Promissory Note Format Telugu
* అప్పు ఇచ్చే వాళ్ళు గానీ, తీసుకునే వాళ్ళు గాని ఇద్దరికీ 18 ఏళ్లు దాటిన పక్షంలో మాత్రమే ఈ ప్రామిసరీ నోటు చెల్లుతుంది.
Advertisement
* ప్రామిసరీ నోటు తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా అప్పు ఇచ్చిన వారు, తీసుకున్నవారు పక్కన ఉండి ప్రామిసరీ నోటు రాయించుకోవాలి.
* ఒకసారి ప్రామిసరీ నోటు రాయించిన తర్వాత అది కేవలం మూడు సంవత్సరాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతుంది. అనంతరం మరో కొత్త ప్రామిసరీ నోటు రాయించుకోవాలి.
* మతిస్థిమితం లేని వారు రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటు చెల్లుబాటు కాదు. ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ఇద్దరు సాక్షులు తప్పనిసరిగా ఉండాలి.
* ఇలా రాయించుకున్న ప్రామిసరీ నోటుపై కచ్చితంగా రూపాయి విలువ చేసే స్టాంపు అతికించి దానిపై అడ్డంగా సంతకం పెట్టాలి. ఇలా ప్రామిసరీ నోటుపై సుమారు కోటి రూపాయల వరకు కూడా అప్పుగా పొందవచ్చు.
* అప్పు తీసుకున్న వారు డబ్బులు ఎగ్గొడితే.. ప్రామిసరీ నోటు సహాయంతో న్యాయపరంగా డబ్బును రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు ఉంటే తప్పనిసరిగా లాయర్ ను సంప్రదించి వాటిని చూసుకోవాలి.
Advertisement
Read also: తవ్వకాలలో బయటపడ్డ 1100 ఎల్లనాటి అతి పురాతన శివలింగం విశిష్టత ఏంటంటే ?