Advertisement
దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మి రిలేషన్ పై ఎన్నో వదంతులు ఉన్నాయి. వీళ్లిద్దరి కలయికలో చాలా సినిమాలే వచ్చాయి. కానీ, హిట్స్ తక్కువే. చివరగా వచ్చిన మూవీ లైగర్. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ మూవీ విషయంలో పూరీకి, డిస్టిబ్యూటర్లకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది వీళ్ల పంచాయితీ. అయితే.. ఈ చిత్రం ఫ్లాప్ తర్వాత ఎక్కడా పూరీ, ఛార్మి కలిసి కనిపించింది లేదు. సడెన్ గా వీళ్లిద్దరూ ఈడీ ఆఫీస్ లో ప్రత్యక్ష్యం అయ్యారు.
Advertisement
లైగర్ మూవీ పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరికీ వారం క్రితం ఈడీ అధికారులు నోటీసులు పంపారు. 17న విచారణ రావాలని చెప్పడంతో పూరీ, ఛార్మీ ఈడీ ఆఫీస్ కు వచ్చారు. ఉదయం 8గంటలకు రాగా.. మధ్యాహ్నం 12 గంటల పాటు విచారణ కొనసాగింది. పెట్టుబడులకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు అధికారులు.
Advertisement
సినిమాల్లో అక్రమ పెట్టుబడులు పెడుతున్నారని.. ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశారు. ‘లైగర్’ చిత్రానికి ఆమె పెట్టుబడులు పెట్టారని, బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకే ప్రయత్నించారని ఆరోపించారు. పాన్ ఇండియా సినిమా చేయాలనుకున్న కవిత .. విజయ్ దేవరకొండను, ఈ సినిమా ప్రొడ్యూసర్ ఛార్మిని, ఇతరులను తన ఇంటికి పిలిపించుకుని వారితో చర్చలు జరిపారని చెప్పారు.
ఈ వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పూరీ, ఛార్మికి నోటీసులు పంపారు. అన్ని విషయాలపై కూపీ లాగారు. ఈడీ ఆఫీసుకు మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుకదారి నుంచి వీళ్లిద్దరు వెళ్లినట్లు సమాచారం.