Advertisement
Pushpa 2 Dialogues in Telugu and English: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ” పుష్ప ది రైజ్” చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు బన్నీ.
Advertisement
ఫస్ట్ పార్ట్ సక్సెస్ తో సెకండ్ పార్ట్ ని కూడా అంతే జోష్ లో గ్రాండ్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సెకండ్ పార్ట్ అప్డేట్స్ తెలుసుకునేందుకు నార్త్ టు సౌత్ వరకు ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అందుకు తగ్గట్లుగానే ఛాన్స్ దొరికినప్పుడల్లా క్రేజీ అప్డేట్స్ తో ముందుకు వస్తోంది మూవీ యూనిట్. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
వేర్ ఇస్ పుష్ప అంటూ ఒక సస్పెన్స్ వీడియోతో ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని కలగజేశారు. అయితే మొత్తం వీడియోని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఆ టీజర్ ని విడుదల చేశారు. ఈ వీడియోస్ మూవీపై విపరీతమైన హైప్ ని పెంచేసింది. అంతేకాదు ఇందులో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించాడు.
తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడని, సుమారు ఎనిమిది బుల్లెట్లు తగలడంతో పుష్ప చనిపోయి ఉంటాడు అనే సస్పెన్స్ తో ఈ వీడియోని రిలీజ్ చేశారు. మరి ఈ వీడియోలోని పూర్తి డైలాగ్స్ ని ఇప్పుడు చూద్దాం.
Advertisement
Pushpa 2 Dialogues and Dialogues Lyrics in Telugu
- తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.
- పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా అతడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
- శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న పోలీసుల కూంబింగ్ ఆపరేషన్.
- బాక్రాపేట్ కొండపై పుష్ప దుస్తులు దొరికినట్లుగా తెలుస్తోంది, పుష్ప దుస్తులపై 8 రౌండ్ల బుల్లెట్లు
- పోలీసుల కాల్పుల్లో పుష్ప చనిపోయాడా..?
- 8 బుల్లెట్లు, అన్ని గాయాలతో అసలు మనిషి బతికే చాన్సే లేదు.
- ఇది కచ్చితంగా పుష్ప ని చంపడానికి చేసిన కుట్రే.
- పుష్ప సంపాదిస్తున్న దుడ్డు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా..?
- పుష్ప.. జిందాబాద్, పుష్ప.. జిందాబాద్
- అసలు పుష్ప ఎక్కడ..?
- అటవీ ప్రాంతంలో పులుల జాడ తెలుసుకోవడం కోసం ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలో దొరికిన ఎక్స్క్లూజివ్ విజువల్స్.
- ఎవడ్రా.. అది సరిగ్గా కనిపించడం లేదు.
- అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే.. అది పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే.. పుష్ప వచ్చాడని అర్థం.
- పుష్పన్న బతికే ఉన్నాడయ్యా
- పుష్ప గాడి రూలు…
Pushpa 2 Dialogues and Images in English
- Pushpa Gaadi Rule
- adavilo janthuvlu rendadugulu venakki vesayante adi puli vacchindani artham ade puli rendu adugulu venakki vesindhante pushpa vacchadani artham.
- tirupati jailu nunchi bullet gayalatho tappinchukunna pushpa.