Advertisement
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండగలిగిన మానవ శిఖరాగ్రాన్ని రజనీకాంత్ లోనే చూడగలం. ఆయన ఎప్పుడూ సూపర్ స్టార్ లా ప్రవర్తించరు. ఎక్కడికైనా ఒక సాధారణ వ్యక్తిగా వెళ్ళిపోతారు. ఆయన మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తారు. అందుకే ఆయనంటే ఎంతో మందికి ఇష్టం. దశాబ్దాల పాటు ప్రజల మనసులో నిలవడం అనేది ఆ చరిత్రకు దక్కే గౌరవం. ఆ చరిత్ర పేరే రజనీకాంత్. సినిమా హీరోకి కావలసిన రంగు, శరీర సౌష్టవం.. ఇటువంటి హంగులు ఏమీ లేవు ఆయన దగ్గర. కష్టించి పనిచేసే మనస్తత్వమే ఉంది.
అలాంటి రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే.. రజనీకాంత్ తన క్లోజ్ ఫ్రెండ్ జయశంకర్ చనిపోతే చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేదట. మరి రజిని ఎందుకు వెళ్లలేదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వక ముందు జయశంకర్ చాలా సినిమాల్లో నటించారు. అంతేకాదు ఆయనను తమిళ్ ఇండస్ట్రీ తమిళనాడు జేమ్స్ బాండ్ అని పిలుచుకునేవారు. రజనీకాంత్ హీరోగా చేస్తే చాలా సినిమాల్లో జయశంకర్ విలన్ గా ఉండేవారు.
Advertisement
అలా వీరిద్దరి మధ్య బాండింగ్ పెరిగి, ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. కానీ జయశంకర్ చనిపోయాడనీ…. తెలియగానే రజినీకాంత్… జయశంకర్ కొడుకుకు ఫోన్ చేసి… ఎప్పుడు నేను మీ ఇంటికి వచ్చిన… మీ నాన్నగారు నన్ను నవ్వుతూ పలకరించేవారు. కానీ ఇప్పుడు ప్రాణం లేని వాడిని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు… అందుకే నేను వాడిని చివరి చూపు చూడడానికి రావడం లేదు. నేను రానంతమాత్రాన… మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నా ప్రాణ స్నేహితుడిని మిస్ అవుతున్నాను అంటూ జయశంకర్ కొడుకుకు రజనీకాంత్ చెప్పారట.
Advertisement