• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » బాల రాముడి కి పట్టాభిషేకం.. మేము రామ్ అంటున్న ఖర్గే, సోనియా సహా పలువురి నేతలు..!

బాల రాముడి కి పట్టాభిషేకం.. మేము రామ్ అంటున్న ఖర్గే, సోనియా సహా పలువురి నేతలు..!

Published on January 22, 2024 by sravya

Advertisement

ఇండియా లో మిగిలిన పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ బాట పట్టాయి. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావట్లేదని తృణమూల్‌ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ట జరిగే వేళా బెంగాల్లోని ఆలయాలు, మసీదులు, చర్చిలని సందర్శిస్తాను అన్నారు. ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బాలరామయ్య ప్రాణ ప్రతిష్టకి హాజరు కావట్లేదు అని చెప్పారు. ప్రతిష్ట తర్వాత కుటుంబ సమేతంగా అయోధ్య వెళ్తానని అన్నారు.

Advertisement

అలానే ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు అవ్వాలని సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌదరికి కూడా ఆహ్వానాలు అందాయి. అయోధ్య అంటూ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయాలు చేశాయని కాంగ్రెస్‌ అంది. అందుకనే ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని అన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి కాలేదని, లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే ఇలా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. మతం అనేది వ్యక్తిగత అంశం అని కాంగ్రెస్‌ అంది. ప్రధాని మోదీ చేపట్టిన రాజకీయ కార్యక్రమం ఇది అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ అన్నారు.

mamatha

Advertisement

 

ఇక ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్‌ బాట పట్టాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని తృణమూల్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ట జరిగేవేళ తాను బెంగాల్‌లోని ఆలయాలు, మసీదులు, చర్చీలను సందర్శిస్తానన్నారు ఆమె. ఇక ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా బాల రామయ్య ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం లేదని తేల్చేశారు.

అయితే ప్రతిష్ట తర్వాత కుటుంబ సమేతంగా అయోధ్య వెళతానన్నారు ఆయన. మరోవైపు మరాఠా స్ట్రాంగ్‌మేన్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌..పనుల ఒత్తిడితో ఈ కార్యక్రమానికి వెళ్లట్లేదన్నారు. 22వ తేదీ తర్వాతే అయోధ్యను సందర్శిస్తానన్నారు ఆయన. ఇక ఎస్పీ అధినేత అఖిలేష్‌, ఆర్జేడీ నేతలు లాలూ, తేజస్వీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదని చెప్పేశారు. మొత్తంమీద రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇండియా కూటమి దూరంగా జరిగింది.

ayodya

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను దేశమంతా పండుగలా జరుపుకుంటుంటే కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి నేతలు బాయ్‌కాట్‌ చేయడం, రాజకీయంగా చర్చనీయాంశమైంది

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

లక్షితపై చిరుత దాడి తర్వాత తిరుమల నడక మార్గంలో టీటీడీ అధికారులు తీసుకున్న భద్రత చర్యలు ఏమిటంటే..? Default Thumbnailజియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ 5 బెస్ట్ ప్లాన్ల గురించి తప్పక తెలుసుకోండి..! జైలు జీవితం గడిపిన టాప్ 7 హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు వీరే.. లిస్ట్ ఓ లుక్ వేయండి! sania-mirza-marriageసానియా మీర్జా కి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్ ! అమ్మాయి ఎవరంటే?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd