Ads
Ranga Ranga Vaibhavanga Review:మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రపతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా‘ ఇందులో కేతిక శర్మ కథానాయక. గిరీశయ్యా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్లో ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇక సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Ranga Ranga Vaibhavanga Review
రంగరంగ వైభవంగా` రివ్యూ: #కథ మరియు వివరణ
కథ విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మాట్లాడుకోకుండా దూరంగా ఉంటారు. ఆ తర్వాత పెద్దయ్యాక ఇద్దరు డాక్టర్లుగా కనిపిస్తారు. ఇందులో కేతికశర్మ రాధ, వైష్ణవ్ తేజ్ రిషి పాత్రలో కనిపిస్తారు. ఆ తర్వాత రిషి కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందుల్లో పడతాడు. ఇక ఆయన పడిన ఇబ్బందులేంటి, ఇంతకీ చిన్నప్పుడు రాధతో ఏం గొడవ జరిగింది, పెద్దయ్యాక ఎలా కలుస్తారు, చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలో ఉంటుంది.
Advertisement
ఇక నటన విషయానికి వస్తే తన తొలి సినిమాతోనే కాస్త మెప్పించిన పంజా వైష్ణవ తేజ్ ఈ సినిమాలో తన నటనతో మెప్పించలేకపోయాడు. అతను విభిన్న భావోద్వేగాలకు ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అతని నటనని మెరుగుపరచడానికి అతను మరింత కష్టపడాలి. కేతిక శర్మ కూడా అందాల బొమ్మలా కనిపించిన ఆమె నటన అంతగా లేదు. నవీన్ చంద్ర తనకు ఆఫర్ చేసిన పాత్రలో డీసెంట్ గా నటించాడు. సీనియర్ నటులు నరేష్, ప్రభు తమ పాత్రలను చక్కగా చేశారు. సత్య మరియు రాజు కుమార్ కసిరెడ్డి కొన్ని నవ్వులు పోయించారు. హర్షిని మరియు ఇతర నటీనటులు కథకు అవసరమైన విధంగా తమ వంతు కృషి చేశారు.
#ప్లస్ పాయింట్స్:
సినిమా కథ,
హీరో హీరోయిన్ నటన,
కామెడీ,
దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్,
డైలాగ్స్,
సినిమాటోగ్రఫీ
#మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగినట్లు అనిపించాయి.
#రేటింగ్ : 2.5/5
ఇవి కూడా చదవండి : కడుపుబ్బా నవ్వించిన మాస్టర్ భరత్ లైఫ్ లో ఇంతటి విషాదముందా..!