• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 02.09.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 02.09.2022

Published on September 2, 2022 by Bunty Saikiran

Advertisement

Rashi Phalalu in Telugu ఈ రోజు రాశి ఫలాలు 2.09.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్‌ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే.. ఇవాళ శుక్ర వారం రోజు. ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం.

మేషం :- వృత్తి వ్యాపారులకు శుభదాయకం. చెడు అలవాట్లకు, స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. మీ తెలివి తేటలకు వాక్ చాతుర్యానికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించండి. ముఖ్యల రాకతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది.

 

వృషభం :- విద్యార్ధుల ఆలోచనలు పక్కదోవ పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కోర్టు వ్యవహరాలు ఒక కొలిక్కిరాగలవు. నిత్యవసర వస్తువ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తి నివ్వగలదు. స్త్రీలు మొండివైఖరి అవలంభించడం వల్ల మాటపడవలసి వస్తుంది.

మిథునం :- స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలలో మెలకువ వహించండి. ఇతరుల వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తారు. ఉద్యోగస్తులు అధిక శ్రమ పడినప్పటికి తగిన గుర్తింపు ఉండదు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు.

కర్కాటకం :- గృహంలో మార్పులు చేర్పులు వాయిదా వేయడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. చిన్నతరహా, చిరువృత్తుల వారికి శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ సౌఖ్యం, వృత్తి వ్యాపారాదులయందు అభివృద్ధి కానరాగలదు. ప్రేమికుల నిర్ణయాలు వివాదాలకు దారితీస్తుంది.

సింహం :- వృత్తి వ్యాపారాలు ప్రగతి పథంలో నడుస్తాయి. రుణసహాయం చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఇతరవ్యాపకాలను వీడనాడి శ్రమించడం శ్రేయోదాయకం. సన్నిహితుల నుంచి అందిన సమాచారం కొత్త ఉత్సాహాన్నిస్తుంది.

కన్య :- ఉద్యోగస్తులకు ప్రైవేటు సంస్థల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. ఖర్చుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. హామీలు ఉండటం మంచిది కాదని గ్రహించండి. విందులు, వినోదాలలోపాల్గొంటారు. ముఖ్యుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Advertisement

తుల :- ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆధ్యాత్మిక, సేవా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది. విలువైన వస్తువులు, ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

వృశ్చికం :- ఉద్యోగస్తులు నూతన హోదాలు పొందే ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు లౌక్యం అవసరం. బంధు మిత్రులను కలుసుకుంటారు. నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. ప్రయాణాలు, మీ కార్యక్రమాలు వాయిదా పడటం మంచిది.

ధనస్సు :- ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి మెళకువ అవసరం. ఉపాధ్యాయులు అధిక శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు మీకెంతో చికాకు కలిగిస్తాయి. ఋణ ప్రయత్నం ఫలించకపోవచ్చు. నిత్యావసర స్టాకిస్టులకు మిశ్రమ ఫలితం.

మకరం :- కుటుంబ, ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. కోర్టు, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ముఖ్యులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సమస్యలను ఎదుర్కొంటారు. మీ కష్టానికి గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది.

కుంభం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. స్త్రీలకు ఆర్జన, విలాస వస్తువుల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. చక్కని ప్రణాళికలతో విజయాన్ని సాధిస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటు చేసుకుంటాయి. దుబారా ఖర్చులు తగ్గించాలన్న మీ యత్నం ఫలించదు.

మీనం :- విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. రాజకీయాల్లో వారు ప్రతిపక్షాల పట్ల ఓర్పు, నేర్పుతో వ్యవహరించాలి. బంధవుల మధ్య అపోహలు తొలగి రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది.

 

Advertisement

READ ALSO : చంద్రముఖి అసలు కథ ఇదే.. సినిమా కి వాస్తవానికి తేడా ఇంత వెరిషన్ ఉందా ?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd