• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 02.02. 2023

Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 02.02. 2023

Published on February 2, 2023 by karthik

Advertisement

Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు… మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.

మేషం :- ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. తాకట్టుపై రుణాలు స్వీకరిస్తారు. గృహ వాస్తుదోష నివారణ వల్ల మంచి ఫలితాలుంటాయి. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు.

Today Horoscope in Telugu 2022

Today Horoscope in Telugu 2022

వృషభం :- ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేక పోతారు. సంఘంలో మీ స్థాయి పెరుగును. విద్యార్థులు క్రీడలు, క్విజ్ వంటి పోటీలలో రాణిస్తారు. తరుచూ దైవకార్యాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరగలదు. శత్రువులపై విజయం సాధిస్తారు.

మిథునం :- ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయుప్రయత్నం వాయిదా వేయడం మంచిది. విద్యార్థినులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు.

కర్కాటకం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాగ్వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ అభివృద్ధికి ఉపయోగపడేటు వంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయం అవుతారు.

సింహం :- వస్త్ర, ఫ్యాన్సీ, నిత్యావసరవస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. ఉపాధ్యాయులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో విభేదాలు తీరతాయి.

కన్య :- నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు వంటివి ఎదుర్కొంటారు.

Advertisement

తుల :- పెద్దల ఆహార వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఏ విషయానికీ కలిసిరాని సోదరీ సోదరుల ధోరణి అసహనం కలిగిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాలవారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు.

వృశ్చికం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలటంతో పొదుపు సాధ్యం కాదు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనస్సు :- రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. పెద్ద మొత్తంలో ధన సహాయం చేయునపుడు పునరాలోచన అవసరం. విద్యార్థులకు ఉన్నత విద్యల విషయంలో ఒత్తిడి, ఆందోళన తప్పవు.

మకరం :- ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. కొంతమంది మీపై అభాండాలు వేసే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్థులకు అనుకూలం. మీ యత్నాలకు చక్కని అవకాశం, ప్రముఖుల సహాయం లభిస్తుంది.

కుంభం :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలు షాపింగులో నాణ్యతను గమనించాలి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలలో మెలకువ, ఏకాగ్రత అవసరం. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.

Advertisement

మీనం :- మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సన్నిహితుల రాకతోఇల్లు సందడిగా ఉంటుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 31.03.2023
  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd