• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Rashi Phalalu in Telugu 2023 : మే 14 రాశిఫలాలు… వీరికి షేర్లు, పెట్టుబడులు కలిసి వస్తాయి

Rashi Phalalu in Telugu 2023 : మే 14 రాశిఫలాలు… వీరికి షేర్లు, పెట్టుబడులు కలిసి వస్తాయి

Published on May 14, 2023 by karthik

Advertisement

Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు…మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.

 

మేషం :- దైవకార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావటం మంచిది. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.

Today Horoscope in Telugu 2022

Today Horoscope in Telugu 2022

వృషభం :- భాగస్వామిక ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. మీ ఉన్నతిని చాటుకోవటానకి ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది.

మిథునం :- వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాల్లో చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. నిరుద్యోగులకు ప్రయత్న పూర్వకంగా సదావకాశాలు లభిస్తాయి.

కర్కాటకం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. బంధుమిత్రులు మిమ్ములను గురించి అపోహపడే ఆస్కారం ఉంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.


సింహం :- ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు.

కన్య :- వస్త్ర, బంగారం, వెండి, రత్నవ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, నగదు అవార్డు వంటి శుభ సంకేతాలున్నాయి. స్త్రీలకు అయిన వారి నుంచి ఆదరణ లభిస్తుంది.

Advertisement

తుల :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరని గమనించండి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. సోదరీ సోదరుల నుంచి చికాకులు అధికమవుతాయి. ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు.

వృశ్చికం :- సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఖర్చులు పెరగటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలు శుభకార్యాల్లో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.

ధనస్సు :- దైవ దర్శనాల్లో పాల్గొంటారు. సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటింబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం ఆహార, ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.

మకరం :- చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తిపెరుగుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువుల చేజారిపోతాయి. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. రచన, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ సంతానం విదేశీ చదువుల విషయంలోఒక నిర్ణయానికి వస్తారు.

కుంభం :- దంపతుల మధ్య అన్యోన్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. ఏసీ కూలర్లు మెకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానవచ్చును. సంఘంలో మీ మాటకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయనాయకులు యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. విందులలో పరిమితి పాటించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి.

Advertisement

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :

  • హీరోయిన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమాలు ఏవంటే…?
  • ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకోసం ఎన్ని కథలను మార్చారో తెలుసా ?
  • వెంకటేష్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా… ఆమె ఆస్తులు ఎంత అంటే!

Related posts:

Today Horoscope in Telugu 2022జూన్‌ 21, మంగళవారం దినఫలాలు.. ఈ రాశుల వారికి లాభాలే లాభాలు ! Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 09.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 17.01.2023 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 12.02. 2023

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd