• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Horoscope » Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 24.06.2022

Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 24.06.2022

Published on June 24, 2022 by Bunty Saikiran

Advertisement

జ్యోతిష్యం ప్రకారం రాశి ఫలాలు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాశిఫలాలు జ్యోతిష్య నిపుణులు నక్షత్రాల ఆధారంగా అంచనా వేస్తారు. అయితే ఈ జ్యోతిష్యాన్ని కొంతమంది నమ్మితే కొంతమంది నమ్మకపోవచ్చు. ఇక జూన్ 24వ తేదీ శుక్రవారం రోజున మేషం నుంచి మీనం వరకు ఏ రాశులకు ఎలాంటి ప్రయోజనాలు అలాగే అనుభవాలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేషం :- స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు అకాల భోజనం వలన ఆర్యోగంలో చికాకులు తప్పవు.

 

వృషభం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఏదైనా అమ్మకానికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.

 

మిథునం :- సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులుండవు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి.

కర్కాటకం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య అనుబంధాలు బలపడతాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు.

 

సింహం :- మీలోని బలహీనతలను తొలగించుకోవటంపై దృష్టి పెడతారు. విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడతాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. ఎవరికైనా ధన సహాయంచేసినా తిరిగిరాజాలదు.

Advertisement

 

కన్య :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి, స్త్రీలు అందరియందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పాత మొండిబాకీలు వసూలవుతాయి. చిన్నపాటి ఆనారోగ్యానికిగురై చికిత్స తీసుకోవల్సి వస్తుంది. ఉద్యోగస్తులు తరుచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

 

తుల :- మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. గృహ మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి.

 

వృశ్చికం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.

 

ధనస్సు :- మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఏసీ కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.

 

మకరం :- బంధు మిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది.

 

కుంభం :- సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకోవలసి వస్తుంది. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. రిప్రజెంటేటివ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి, చికాకులు వంటివి తప్పవు.

 

మీనం :- వాతావరణంలోని మార్పు రైతులలో ఆందోళన కలిగిస్తుంది. శత్రువుల కూడా మిత్రులుగా మారతారు. మిర్చి, నూనె, పసుపు, చింతపండు స్టాకిస్టులకు. రిటైల్ వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ నుండి ధన, వస్తు సహాయం ఆశించవచ్చు.

Also read:

అనౌన్స్‌ చేసి రిలీజ్‌ కానీ… మ‌హేష్ బాబు సినిమాలు ఇవే !

Related posts:

Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 18.08.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 22.08.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 11.09.2022 Today Horoscope in Telugu 2022Weekly Rashi Phalalu in Telugu : వీక్లీ రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి శుభవార్త

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd