• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 29.08.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 29.08.2022

Published on August 29, 2022 by Bunty Saikiran

Advertisement

Rashi Phalalu in Telugu ఈ రోజు రాశి ఫలాలు 29.08.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్‌ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే.. ఇవాళ సోమ వారం రోజు. ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం.

మేషం :- మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి చేసినా విమర్శలు తప్పవు. ఇరుగుపొరుగు వారి వైఖరివల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. మీ నైపుణ్యతకు, సామార్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది.

వృషభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.

 

మిథునం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. రాజకీయాలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. పిల్లల భవిష్యత్తును గురించి పథకాలు వేసి జయం పొందుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

 

కర్కాటకం :- కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతో అవసరం. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ముఖ్యమై వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి.

సింహం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ, తోటల రంగాల వారు శాస్త్రవేత్తల సలహాలు పాటించటం శ్రేయస్కరం. రుణాలు, చేబదుళ్ళు స్వీకరించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. రవాణా రంగాలలో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది.

 

కన్య :- కుటుంబీకులతో స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.

Advertisement

 

తుల :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు.

వృశ్చికం :- స్త్రీలకు స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరికి సహాయం చేసి మాటపడవలసి వస్తుంది. మొండిబాకీలు వసూలుచేస్తారు. పొదుపు చేద్దామనుకున్నమీ ఆలోచన ఫలించదు. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.

 

ధనస్సు :- ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో హడావుడిగా ఉంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత అవసరం. అకాలభోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు నూతన వాతావరణం, పరిచయాలకు క్రమంగా అలవాటు పడతారు.


మకరం :- ఉమ్మడి వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. మీ ఆంతరంగిక సమస్యలకు నెమ్మదిగా పరిష్కర మార్గం దొరుకుతుంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలేర్పడే ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. ఆధ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత వహించలేరు. ప్రభుత్వోద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీలు రావచ్చు.

 

కుంభం :- రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది.

 

మీనం :- ఉద్యోగస్తులకు అధికారు లతో ఏకీభావం కుదరదు. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల సమస్యలను ఎదుర్కుంటారు. నియమాలకు కట్టుబడి ఉండుటవలన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకుమంచి గుర్తింపు లభిస్తుంది.

Advertisement

READ ALSO : ‘పెళ్లి చూపులు’ లాంటి బంపర్‌ హిట్‌ సినిమాను వదులుకున్న నిఖిల్‌ !

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd