• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » రవితేజ “రావణాసుర” టీజర్ లో సీతమ్మకు అవమానం ?

రవితేజ “రావణాసుర” టీజర్ లో సీతమ్మకు అవమానం ?

Published on March 8, 2023 by karthik

Advertisement

సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన కొత్త చిత్రం “రావణాసుర”. వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను సోమవారం రిలీజ్ చేశారు. అభిషేక్ నామ, రవితేజ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్, బీమ్స్ కలిసి సంగీతం అందించారు. ఈ చిత్రం టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్ కు ఈ టీజర్ అదిరిపోయేలా చేసింది. అదే సమయంలో ట్రైలర్ పై విమర్శలు కూడా వస్తున్నాయి.

READ ALSO : దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలలోని ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

 

ఇందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమాలో హిందువులు దైవంగా భావించే సీతమ్మ వారిపై డైలాగ్ ఉండటమే. ఈ సినిమాలో ‘సీతను చేరుకోవాలంటే సముద్రాన్ని దాటితే సరిపోదు, ఈ రావణాసురుడిని దాటాలి’ అన్న డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ ను రవితేజ చెబుతాడు. డైలాగ్ సీతమ్మవారిని తక్కువ చేసే విధంగా ఉండటంతో నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఆ మహాతల్లి జీవితంలోని విషాద ఘట్టాన్ని వాడుకోవడం ఏంటని మండిపడుతున్నారు.

Advertisement

Read also: వైరల్ అవుతున్న జబర్దస్త్ కమెడియన్స్ యాక్టర్స్ పెళ్లినాటి ఫొటోస్ చూసారా ?

 

రావణాసురుడి బలాన్ని చెప్పడం కోసం సీతమ్మను తక్కువ చేసి చూపాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చిత్రబృందంపై విరుచుకుపడుతున్నారు. సినిమా పేరు రావణాసుర అని పెట్టి, నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడానికి ఆ సందర్భంగా సీతమ్మను తెరపైకి తేవటం బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావణాసురుడి బలం గురించి చెప్పాలంటే రామాయణంలో కొన్ని వందల సంఘటనలు ఉన్నాయని, వాటిని కాదని సీతమ్మవారికి సంబంధించిన సంఘటనలు ఉపయోగించడం బాధాకరమన్నారు.

Read also: అలనాటి అందాల తార హీరోయిన్ “దివ్య భారతి” మరణానికి ఆ సినిమాకి ఉన్న సంబంధం ఏంటంటే ?

Advertisement

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd