Ads
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలు తప్పుల తడకగా మారాయి. దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదయ్యాయి. మరణించిన రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందంగా.. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందగా ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని ఢిల్లీకి పిలిపించడం విధితమే. తాాజాగా బూత్ స్థాయి అధికారులు గా సచివాలయ సంక్షేమ కార్యదర్శులను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు బీఎల్ఓలుగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల స్థానంలో అత్యధిక చోట్ల గ్రామ, వార్డు సచివాలయాలోని సంక్షేమ కార్యదర్శులను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
ఇప్పటివరకు బీఎల్ఓలుగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల స్థానంలో అత్యధిక చోట్ల గ్రామ, వార్డు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులను నియమించడం వెనుక ఏదో దాగి ఉందని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సంక్షేమ కార్యదర్శులను బీఎల్ఓలుగా నియమించడం ద్వారా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయాలనేది వైసీపీ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నాయి. బీఎల్ఓ బాధ్యతల నుంచి సంక్షేమ కార్యదర్శులను తప్పించాలని సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాసిన కలెక్టర్లు స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. బీఎల్ఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో పని భారం మరింత పెరిగిందని పలువురు సంక్షేమ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు జాబితాల నుంచి తొలగింపులో బూత్ స్థాయి అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు.