Advertisement
ప్రస్తుతం ఏ చిన్న ఆసుపత్రికి వెళ్ళినా కూడా ఓపీ సర్వీస్ కనీసం 500 ఉంటుంది. ఆ తర్వాత పరీక్షలు, మందులు, సర్జరీలు ఇలా చాలానే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంకా రాష్ట్రంలో 10 రూపాయల డాక్టర్లు అక్కడక్కడ సేవలు అందిస్తున్నారు. అంతే కాకుండా ఇదే కోవలో మరికొందరు పది రూపాయల డాక్టర్లు కూడా సేవలు అందించడానికి సిద్ధమవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సైతం పులివెందులలో పది రూపాయల డాక్టర్ గానే పేరు తెచ్చుకున్నారు.
Advertisement
విజయవాడ నుంచి వెళ్లి కడపలో ఇదే పది రూపాయల కాన్సెప్ట్ తో నూరి పరి అనే మహిళ డాక్టర్ కూడా సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మరో 10 రూపాయలు డాక్టర్ సేవ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎంబిబిఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయిన లక్ష్మి ప్రియ సొంత గడ్డ అయిన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పది రూపాయలకే అవుట్ పేషెంట్ సేవలు అందించడానికి సిద్ధమవుతున్నారు.
Advertisement
Also read:
దసరా నుంచి ఈ సత్ కార్యం మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. జనరల్ కేసులు, పీడియాట్రిక్ కేసులు, స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు, బీపీ, షుగర్ వంటి సమస్యలను తగ్గించుకోవడానికి డాక్టర్ని సంప్రదించవచ్చు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 8 వరకు లక్ష్మీప్రియ అందుబాటులో ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!