• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » ‘నీ అందం తగ్గిందంటూ’ ట్రోల్ చేసిన మిం పేజ్ పోస్ట్ కి సమంత ఇచ్చిన రిప్లై అదుర్స్ !

‘నీ అందం తగ్గిందంటూ’ ట్రోల్ చేసిన మిం పేజ్ పోస్ట్ కి సమంత ఇచ్చిన రిప్లై అదుర్స్ !

Published on January 11, 2023 by karthik

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే మంచే విజయాన్ని అందుకొని వరుస ఆఫర్లతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన
నటన, టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. దీనిపై ఆమె ఇటీవల ప్రకటించింది.

 

ఇక సోమవారం జరిగిన టైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత నటించిన శాకుంతలం ట్రైలర్ విడుదల అయింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు గుణశేఖర్ తో పాటు సమంత కూడా ఎమోషన్ అయ్యారు. గుణశేఖర్ కండతడి పెట్టుకోగా, సమంత కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం సమంత కన్నీళ్లు పెట్టుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం ఈ వీడియో పైనే కాదు, ఆమె శరీరంలో వచ్చిన మార్పుల గురించి కూడా నెట్టింట కామెంట్లు రావడం మొదలయ్యాయి.

Advertisement

 

బజ్ బాస్ బాస్కెట్ అనే ట్విట్టర్ ఖాతా ఈ విధంగా రాసుకొచ్చింది. “సమంతను చూస్తే జాలేస్తోంది. ఆమె తన అందాన్ని కోల్పోయింది. ఆమె విడాకుల నుంచి బయటపడి వృత్తిలో ఎదుగుతుందని అనుకుంటున్నా సమయంలో మయూసైటిస్ ఆమెపై దారుణంగా దాడి చేసింది. ఆమెను మరోసారి బలహీనురాలిని చేసింది” అని అంది. ఈ పోస్ట్ పై సమంత స్పందించారు. ఆమె తన ట్వీట్ లో, “నాలాగా మీరు నెలల పాటు చికిత్స, మందుల పాలు కాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నా. మీరు బాగుండాలని కోరుకుంటూ నా వైపు నుంచి కొంత ప్రేమను పంపిస్తున్న” అని పేర్కొన్నారు. సమంత ఇచ్చిన రిప్లై కి ఆమె ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్లు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.

Advertisement

READ ALSO; ఆర్ఆర్ఆర్ కు గోల్డెన్ గ్లోబ్.. పీఎం సహా ప్రముఖుల విషెస్..


Latest Posts

  • కమెడియన్ పంచ్ ప్రసాద్ ఇల్లు మాములుగా లేదుగా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
  • ఆవు కాదమ్మా గేదె-తంతే అక్కడ పడతావ్ అంటూ అషురెడ్డిపై ట్రోల్స్..!!
  • “ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
  • ఒకే కథతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు.. ఏంటంటే..?
  • మొదటిరోజే విపక్షాల ఝలక్

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd