Ads
మన భారతదేశం అంటేనే అనేక భక్తి భావాలు కలిగినటువంటి దేశం. మనదేశంలో ఎన్నో మతాలు, కులాలు వారికి సంబంధించిన దేవుళ్ళు, దేవాలయాలు ఉంటాయి. ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి చాలామంది శ్రావణమాసం వచ్చిందంటే భక్తిశ్రద్ధలతో ఉంటారు. మరి దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న 12 మాసాలలో శ్రావణమాసం అనేది ఐదవది. ఈ మాసంలో లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అనుకుంటే శ్రావణ శుక్రవారాలు ఈ విధంగా చేస్తే అనేక అద్భుత ఫలితాలు వస్తాయని అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు.
అయితే చాలామంది శ్రావణ శుక్రవారం లో వచ్చిన రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. ఈ వరలక్ష్మీ వ్రతానికి ఎంతటి విశిష్టత ఉందో అందరికీ తెలిసిన విషయమే. మనకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు,భాగ్యాలు పొందాలి అంటే శ్రావణమాసం రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని విధిగా ఆచరిస్తారు భారతీయ మహిళలు. కానీ చాలామంది శ్రావణమాసంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మరి ఆ తప్పులు ఏంటో ఒకసారి చూద్దాం..
Advertisement
శ్రావణ మాసం లో ఎవరైనా సరే పగలు నిద్రపోకూడదట, శుక్రవారం రోజున భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ దేవిని పూజిస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయట. ఈ శ్రావణ మాసంలో మద్యం మరియు మాంసం జోలికి అస్సలు పోకూడదు. మాంసం తిన్నా,మద్యం తాగినా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అందుకే ఈ మాసంలో వీటికి పూర్తిగా దూరంగా ఉండాలని, మాంసం అస్సలు తినరాదని, భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం చేపడితే సుఖ సంతోషాలతో పాటుగా, ఆర్థిక కష్టాలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.
ALSO READ: