Advertisement
Saripodhaa Sanivaaram OTT: నాని దసరా మూవీ తో 100 కోట్ల క్లబ్లో చేరారు. ఆయన మరోసారి సరిపోదా శనివారం సినిమాతో సత్తా చాటారు. సినిమా సక్సెస్ తో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అయింది. బాక్స్ ఆఫీస్ శివతాండవం పేరుతో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లాక్ అయిందని మీడియా వర్గాల నుంచి సమాచారం. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్న నాని తాజా చిత్రం సరిపోదా శనివారం కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.
Advertisement
ఈ సినిమాపై రిలీజ్ కి ముందు నుంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ దర్శకత్వంలో గతంలో అంటే సుందరానికి వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఫ్యామిలీలకు బాగా నచ్చింది. ఇప్పుడు రూట్ మార్చి మాస్ ఆడియెన్స్ కోసంఈ సినిమాను తీసుకువచ్చారు.
Advertisement
Also read:
సరిపోదా శనివారం సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఛానల్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతుందట. సౌత్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది అఫీషియల్ గా అయితే ప్రకటన రాలేదు. ఈ సినిమాలో సూర్యగా నాని, సిఐ దయానంద్ గా సూర్య మధ్య ఘర్షణ సినిమాకి హైలైట్ గా నిలిచింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!