Advertisement
ప్రతి ఒక్కరికి నిద్రపోతున్న సమయంలో కలలు కనడం సహజం. ఇందులో కొన్ని కలలు మన భవిష్యత్తుకు సంబంధించినవి ఉంటాయి. మనకు కలలో కనిపించే దృశ్యాలు భవిష్యత్తు గురించి లేదా మంచి చెడు సూచనలు ఇస్తాయని చెబుతూ ఉంటారు స్వప్న శాస్త్ర నిపుణులు.. ఒక్కోసారి మన కలలోకి సంబంధం లేని వస్తువులు కనబడుతూ ఉంటాయి. అయితే కొన్ని కలలు మన జీవితంలో జరగబోయే అశుభ ఫలితాలను తెలియజేస్తే, కొన్ని శుభ ఫలితాలను తెలియజేస్తాయి. ముఖ్యంగా మన కలలో ఏ ఏ జంతువులు కనిపిస్తే శ్రేయస్కారమో ఇప్పుడు చూద్దాం..
ఆవు:
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవు కనిపించడం చాలా అదృష్టం. వీరు త్వరలో విజయాలు అందుకుంటారని సూచన.
ఏనుగు:
స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో ఏనుగు కనిపించినట్టయితే అదృష్టమే. మీరు త్వరలో ఆకస్మిక లాభాలు, మీ కష్టాలు ముగియబోతున్నాయని సూచన.
గుడ్లగూబ:
మీ కలలో గుడ్లగూబ కనిపిస్తే త్వరలో సంపద దేవత అయిన లక్ష్మీ ఆశీర్వాదం పొందుతారని అంటుంటారు. ఈ మీరు అనుకున్న పనులు త్వరలో నెరవేరుతాయి అని సూచన.
Advertisement
నలుపు రంగు పాము:
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నలుపు రంగు పాము కనిపించడం వల్ల చాలా అదృష్టం. త్వరలో మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి అని సూచన.
బల్లి:
ముఖ్యంగా కలలో బల్లి కనిపిస్తే శుభప్రదం. త్వరలో మీకు డబ్బు అందుతుందని సాంకేతం.
కుందేలు:
మీ కలలో కుందేలు కనిపించినట్టయితే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతుందని సంకేతం.
also read:Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 28.01. 2023