Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజమౌళి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసుకు వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు. రాజమౌళి తీసిన బాహుబలి కానీ ఆర్ఆర్ఆర్ కాని చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. రాజమౌళి సినిమాలు చూసినట్లయితే చత్రపతి శేఖర్ ఆయన సినిమాల్లో ఎక్కువగా కనబడుతుంటారు. రాజమౌళి సినిమా ద్వారా ఆయన పాపులర్ అయ్యారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు.
Advertisement
నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ లో శేఖర్ ఒక మెయిన్ సీన్లో కనపడ్డారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాలో కూడా ఆయన కనపడ్డారు. అలానే సింహాద్రి సినిమాలో కూడా చత్రపతి శేఖర్ నటించారు. చత్రపతి సినిమాతో శేఖర్ కెరియర్ టర్న్ అయిపోయింది. దీంతో చత్రపతి శేఖర్ గా పేరు పొందారు. ఇప్పటికి కూడా అందరూ ఆయనను చత్రపతి శేఖర్ అనే పిలుస్తారు. మగధీర, మర్యాద రామన్న, ఈగ, ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా చత్రపతి శేఖర్ నటించారు.
Advertisement
Also read:
కేవలం యమదొంగ, బాహుబలి 1 , బాహుబలి 2 లో మాత్రమే ఛత్రపతి శేఖర్ నటించలేదు కానీ మిగిలిన సినిమాలు అన్నిటిలో కూడా చత్రపతి శేఖర్ నటించారు. చత్రపతి శేఖర్ తన నటనతో అందరిని మెప్పిస్తూ ఉంటారు. చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తూ ఉంటారు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికి కూడా ఈయన సినిమాల్లో నటిస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!