Ads
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే మిగతా ఇండస్ట్రీలకు చులకన బాగా ఉండేది.. అలాంటి తెలుగువాడి సత్తాను ప్రపంచ లెవల్లో చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన రూపొందించిన బాహుబలి,ఆర్ఆర్ఆర్ సినిమాలు వరల్డ్ వైడ్ గా తెలుగు ఇండస్ట్రీ టాలెంట్ ఏంటో చూపించాడు.. బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ కు, ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లా రేంజ్ పెంచారు జక్కన్న..
ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై నెలలు గడుస్తున్నా కానీ ఆ మూవీకి సంబంధించి డైలాగులు, సన్నివేశాలు ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర మెదులుతూనే ఉన్నాయి.. అలాంటి గొప్ప డైరెక్టర్ రాజమౌళి అలవాట్ల గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అంతే కాకుండా ఆయన భార్య రమా రాజమౌళి ని ఓ చానల్లో ఇంటర్వ్యూ చేశారు.. ఈ సందర్భంలో ఆమె రాజమౌళి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.. అవేంటంటే.. జక్కన్న ఇంటికెళ్తే పిల్లలతో చాలా హ్యపీగా ఉంటారట. వాళ్ళు ఏం చెప్పినా చాలా శ్రద్ధగా గ్రహిస్తారని చెప్పుకొచ్చింది. అతను చాలా టాలెంటెడ్ పర్సన్ అంటూ గొప్పగా పొగిడేసింది.
Advertisement
డబ్బంటే ఆయనకు ఆసక్తి ఉండదు. డబ్బు విషయాన్ని అస్సలు పట్టించుకోరు.. ఎవరైనా రాజమౌళి దగ్గర డబ్బు ఉండవచ్చు అని ఆయనతో బయటకి వెళ్తే మాత్రం ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే అతని జేబులో ఒక్క రూపాయి కూడా ఉంచుకోరు.. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఆ సమయంలో డబ్బు అవసరం ఉంటే కష్టం కదా.. అందుకే ఆయన కారు డ్రైవర్ దగ్గర డబ్బు ఉంచమని ఇస్తాను అని చెప్పుకొచ్చింది రమా రాజమౌళి.. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.
మరిన్ని తెలుగు వార్తల కోసం !