Advertisement
Laal Singh Chaddha : అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డ’. కరీనాకపూర్, అక్కినేని నాగచైతన్య, కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ కు హిందీ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి అద్వేత్ చందన్ దర్శకత్వం వహించారు.
వయాకామ్ స్టూడియోస్, పారా మౌంటు పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ ఆందారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 11 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
read also: టాలీవుడ్ మొత్తం అడిగినా కూడా వెంకటేష్ ఆ పని చేయరట !
‘లాల్ సింగ్ చడ్డ’ కి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు
#1 30 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. ఆ సినిమాని ఎక్కువ మంది చూడకపోవడం ‘లాల్ సింగ్ చడ్డ’ కి మొదటి నుండి ప్లస్ పాయింట్ అయింది. ఆ కథతో పోలిస్తే ఇందులో చాలా మార్పులు చేశారని మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ అది 142 నిమిషాల సినిమా అయితే ఇది 165 నిమిషాల సినిమా. కానీ థియేటర్లలో చూసిన ప్రేక్షకులకు ఏదో నాలుగు గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
#2 చెప్పుకోవడానికి కథ బాగానే ఉంటుంది. కానీ కథనం చాలా వీక్ గా ఉంటుంది. ఇందుకు అద్వైత్ చందన్ ను బ్లేమ్ చేయక తప్పదు. హిందీ ప్రేక్షకులు కూడా బయోపిక్ లు, డాక్యుమెంటరీలు వంటి వాటిని చూసి చూసి అవి బోర్ కొట్టేసి, ‘పుష్ప’ వంటి సౌత్ సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. వీటిని దర్శకుడు కనీసం గ్రహించలేదా అనే అనుమానం అడుగడుగునా కలుగుతుంది.
Advertisement
#3 ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కరీనాకపూర్, నాగచైతన్య వంటి వారి పాత్రలు తప్ప మిగిలిన పాత్రలు ఏమాత్రం గుర్తుండవు అనడంలో అతిశయోక్తి లేదు. తల్లి పాత్ర చేసిన మోనా సింగ్ మాత్రం పర్వాలేదు అనిపించింది. అందుకే సినిమా నిండా బోలెడంత క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఏ పాత్ర కూడా గుర్తుండదు.
#4 కరీనాకపూర్, రూప పాత్రలో బాగా నటించింది. కానీ అతని పాత్ర, ఒక వ్యాంప్ పాత్రను తలపిస్తుంది. ఆమె లుక్స్ కూడా ఆమె ఏజ్ ను గుర్తుచేసే విధంగా ఉంటాయి. డబ్బు ఉంటే ఒకలా, డబ్బు లేకపోతే ఇంకోలా ప్రవర్తించే ఆ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పకపోగా ఈ పాత్రతో బాగా బోర్ కొట్టించాడు.
#5 సినిమాలో ఉన్నంతలో నాగచైతన్య చేసిన బాలరాజు పాత్రమెప్పిస్తుంది. ఈ సినిమా కోసం అతను చూపించిన వేరియేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. కాకపోతే చీటికిమాటికి చడ్డి బనియన్, చడ్డి బనియన్ అంటుంటే, విసుగు పుడుతుంది. అర్ధాంతరంగా ఆ పాత్రను ముగించి సినిమాని మళ్లీ నీరసంలోకి నెట్టి వేసినట్లు అయ్యింది.
#6 సాంగ్స్ విషయంలో ప్రీతం కు మంచి మార్కులు వేయవచ్చు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తనూజ్ డిసప్పాయింట్ చేశాడు.
#7 క్లైమాక్స్ లో హీరోయిన్ వెళ్ళిపోయినప్పుడు అమీర్ ఖాన్ నాలుగు రోజుల పాటు పరిగెడుతూనే ఉంటాడు. ఆ సీన్ చూస్తే మనకు ఆయాసం వస్తుంది, అనడంలో అతిశయోక్తి లేదు.
#8 ఈ సినిమాకి ఎడిటింగ్ కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి. మన టాలీవుడ్ దర్శకుడు అయిన రాజమౌళి, సుకుమార్ వంటి వారికి స్పెషల్ గా షో వేసినప్పుడు వాళ్లు దీని గురించి ఏమి చెప్పలేదా అనే డౌట్ కూడా అందరికీ కలుగుతుంది.
#9 క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు ఏమాత్రం బాగోదు. శుభం కార్డు ఎప్పుడు పడుతుందా అనే ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉంటాడు.
Advertisement
Laal Singh Chaddha Review : లాల్ సింగ్ చడ్డా రివ్యూ..