Advertisement
తమిళ నటులు సూర్య మరియు కార్తీ తమిళ చిత్ర పరిశ్రమ నుండి చెన్నై వరదల సహాయక చర్యల్లో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. సూర్య మరియు కార్తీ రూ. 10 లక్షల ప్రాథమిక విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళాన్ని తమ అభిమాన సంఘాల ద్వారా పంపిణి చేస్తున్నామని ప్రకటించారు. మిచటన్గ్ తుఫాను కారణంగా కుండపోత వర్షం కురిసి చెన్నై నీటిలో మునిగిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తుఫాను కారణంగా చాలా దుర్వార్తలే వినాల్సి వచ్చింది.
Advertisement
ట్రేడ్ నిపుణుడు మనోబాల వి తాజాగా తన X అకౌంట్ లో ఓ వార్తని పంచుకున్నారు. ““చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు మరియు తిరువళ్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు నటులు #సూర్య & #కార్తీ ప్రాథమికంగా ₹ 10 లక్షలను విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించారు”. సూర్య, కార్తీ తమ ఫ్యాన్ క్లబ్‌ల ద్వారా బాధిత వారికి సహాయం అందిస్తున్నారు అని ఆయన తెలిపారు.
Advertisement
బాధిత వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు నెటిజన్స్ ఈ హీరో బ్రదర్స్ ని ప్రశంసిస్తున్నారు. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, కడలూరు మరియు తిరువళ్లూరు జిల్లాలు కురుస్తున్న వర్షాల వలన తమిళనాడులో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నైలోని చాలా ప్రాంతాలు ప్రస్తుతం నీటిలో మునిగిపోయాయి, లోతట్టు ప్రాంతాలలో భారీ వరదలు ఉన్నాయి, పౌర ఏజెన్సీ సిబ్బంది నిలిచిపోయిన నీటిని క్లియర్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు జలమయమైన రోడ్లపై తేలియాడుతూ కనిపించాయి. నగరంలోని ఓ రోడ్డుపై రాత్రిపూట మొసలి సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైలోని పెరుంగళత్తూరు ప్రాంతంలో ఈ మొసలి కనిపించినట్లు సమాచారం.
Read More:
మహానటి సావిత్రి ఈ పెంపుడు జంతువుని పెంచుకున్నారా? ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు!
మీ చెప్పుల్ని ఎవరైనా కొట్టేసారా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ ప్రభావం ఎలా పడుతుందో తెలుసా?
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే.. ఎక్కడ నుంచి మొదలైందంటే?