• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » టీడీపీలోని ఆ ఎంపీని వైసీపీ చేర్చుకుంటుందా ?

టీడీపీలోని ఆ ఎంపీని వైసీపీ చేర్చుకుంటుందా ?

Published on June 27, 2022 by Sravan Kumar Sunku

Advertisement

బెజవాడ రాజకీయం కాకరేపుతోంది. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీతో కొంత కాలంగా అంటీముట్టనట్లు ఉంటున్న కేశినేని నాని.. పార్టీలోనే ఉంటారా.? లేక వైసీపీలోకి జంప్‌ అయిపోతారా.? అన్నది చర్చనీయాంశమైంది. ఈ ప్రశ్నలు రావడానికి కారణాలు లేకపోలేదు. కొద్దిరోజులుగా నాని వ్యవహారం.. సొంతపార్టీ నేతలకే ఇబ్బందికరంగా మారింది. అసలు ఇయన పార్టీలో ఉన్నాడా లేదా.? అన్న చర్చ జరుగుతోందంటే.. పార్టీ క్యాడర్‌తో ఆయన ఎంత టచ్‌లో ఉన్నారో అర్థమవుతోంది

 Kesineni Nani

Kesineni Nani

ముందు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని.. ఆ తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కుమార్తెను బరిలోకి దించి కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. అయితే కొద్దిరోజులుగా పార్టీలో ఇమడలేకపోతున్న కేశినేని.. అధికార పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. గతంలో ఆయన బీజేపీలోకి వెళ్లడానికి కూడా ప్రయత్నించారు. ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతలతో అంతర్గత సమావేశాలు జరిపారు కూడా. దీనికి ఊతమిస్తూ కేశినేని భవన్‌ బయట గోడకు ఉన్న చంద్రబాబు ఫొటోను తీసేసి.. ఆ ప్లేస్‌లో రతన్‌టాటాతో ఉన్న ఫొటోను పెట్టుకున్నారు కేశినేని. అంతటితో ఆగకుండా పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఇన్‌ఛార్జ్‌లు, ఇతర ముఖ్య నాయకుల ఫొటోలు కూడా తొలగించారు. వాటి స్థానంలో రతన్‌ టాటా ట్రస్ట్‌, ఎంపీ నిధులతో కేశినేని నాని చేసిన సేవా కార్యక్రమాల ఫొటోలను పెట్టారు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చకు దారితీస్తోంది. పార్టీ అధినేత ఫొటోనే ఆయన పక్కనపెట్టేశారు అంటే.. ఆయన పార్టీని కూడా పెక్కన పెట్టేసినట్లే అంటున్నారు.

Advertisement

kesineni nani

kesineni nani

Advertisement

కేశినేని నాని కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని.. వచ్చే ఎన్నికలకు మరో నేతను వెతుక్కోవాలని పార్టీ అధిష్టానానికి కేశినేని నాని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి బొండా ఉమ, బుద్ధా వెంకన్నతో కేశినేని నానికి పొసగడం లేదు. ఈ ఇద్దరు నేతలే కాదు.. పార్టీలోని ఏ నేతతోనూ ఆయన సఖ్యతగా ఉన్నట్లు కనిపించడం లేదు. విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల సమయం ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. చివరకు చంద్రబాబుని కూడా లెక్కచేకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నారు కేశినేని. దీనిపై సొంత పార్టీ నేతలే ఆయనపై ఫైరయ్యారు. మీడియా సమక్షంలోనే తీవ్రంగా విమర్శించారు. కేశినేని వ్యవహారంపై ఇబ్బంది పడుతున్న చంద్రబాబు కూడా.. కేశినేనిపై విమర్శలు చేయకుండా నేతలను అడ్డుకోలేదు. దీంతో పార్టీ అధినేత కూడా ఆయనను పక్కనబెట్టారని అర్థమవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యామ్నాయ పొలిటికల్‌ ప్లాట్‌ఫామ్‌ను వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీలోకి వెళ్లినా ఏపీలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండదు కాబట్టి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అయితే బెటర్‌ అని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో.. వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ పార్టీ అగ్రనాయకులతో టచ్‌లోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారట. గ‌తంలోనే వైసీపీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా కామెంట్స్ చేసిన కేశినేనికి ఆ పార్టీ ఎంత‌వ‌ర‌కు ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటుంది అనేది ప్ర‌స్తుతానికి ప్ర‌శ్న‌ర్థ‌క‌మే.

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd