• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » తెలుగు ఇండస్ట్రీ @50 ఇయర్స్.. నటులు వీళ్ళే !

తెలుగు ఇండస్ట్రీ @50 ఇయర్స్.. నటులు వీళ్ళే !

Published on September 17, 2022 by Bunty Saikiran

Advertisement

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో గొప్ప నైనది. ఈ పరిశ్రమలో ఎంతో మంది స్టార్లు చిన్న స్థాయి పాత్ర నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగారు. అయితే  మన తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే గుర్తుండిపోతారు. అయితే అలా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళు పాతుకుపోయిన వారిలో టాలీవుడ్ కు చెందిన నటులు ఎంతోమంది ఉన్నారు. వయసు పైబడి సినిమాలకు దూరంగా కొంతమంది ఉండగా, మరి కొంతమంది మాత్రం 70 ఏళ్ళు పైబడినప్పటికీ సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఆ నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన్నన బాలయ్య ఈయన వయసు 91.యాక్టర్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈయన సినిమాలు చేయకపోయినా, ఆరోగ్యంగా ఉంటూ ఇంటి వద్దనే ఉంటూ ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్స్ కి అతిధిగా వస్తున్నారు. రామోజీరావు ప్రొడ్యూసర్ గా ఉష కిరణ్ మూవీస్ సంస్థను పెట్టడమే కాక రామోజీ ఫిలిం సిటీ తో కొన్ని వేల సినిమాలతో అనుబంధాన్ని ముడి పెట్టుకున్నారు. ఈటీవీ వ్యవస్థాపకులు ఈయన వయసు 85 సంవత్సరాలు. ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్లకు వస్తారు. సీనియర్ యాక్టర్ శారద ప్రస్తుతం ఈమె వయసు 77 సంవత్సరాలు. బ్లాక్ అండ్ వైట్ నుండి వెండితెరపై వెలుగు వెలుగుతూ వచ్చారు. ప్రస్తుతం ఎక్కువగా దైవచింతనములో గడుపుతూ అవకాశం వచ్చినప్పుడు తెరపై కనిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కైకాల సత్యనారాయణ ఈయన వయసు 87. ప్రస్తుతం కాస్త ఆరోగ్యం క్షీణించింది. అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈయనకు సినీ ఇండస్ట్రీలో విడదీయలేని అనుబంధం ఉంది.

Advertisement

కే.విశ్వనాథ్ బహుముఖ ప్రజ్ఞాశీలి. శుభసంకల్పం, స్వయంకృషి, శంకరాభరణం వంటి ఎన్నో ఆణిముత్యాలను వెండితెరకు అందించడమే కాక, నటనలోను ఆయన ప్రతిభను చాటారు. సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ ఈమె వయసు 74. ఎన్టీఆర్ ఏఎన్నార్ టైం లో నెంబర్ వన్ గా వెలిగిన ఈమె ప్రస్తుతం చెప్పుకోదగ్గ క్యారెక్టర్ వస్తే నటించడానికి సిద్ధం అంటున్నారు. మన హీరోయిన్ జమున ఈమె వయసు 86 సంవత్సరాలు. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇప్పటికీ అదే చలాకితనం చిన్నపిల్లవలె తన ఇంట్లో డాన్సులు చేస్తూ ఉంటారు. బ్లాక్ అండ్ వైట్ కాలంలో 100కు పైగా చిత్రాల్లో నటించారు ఆమె. మరో సీనియర్ యాక్టర్ శరత్ బాబు వయసు 71. ఎంతో హెల్తీగా సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. రమాప్రభ వయసు 75 ఏళ్లు. మొత్తం 14 కి పైగా చిత్రాల్లో నటించారు ఆమె. సీనియర్ యాక్టర్ కృష్ణంరాజు ఈయన వయసు 83. మంచి యాక్టివ్ గా సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు.

బి. సరోజా దేవి ఈమె వయసు 85 సంవత్సరాలు. 1990 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. భర్త దూరం అవడంతో వెండితెరకు దూరమై ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. సీనియర్ యాక్టర్ గిరిబాబు మొన్నటి వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఈయన వయసు 83 ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటున్నారు. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ఈయన వయసు 81. కానీ చూడ్డానికి ఈయన చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తున్నారు. చలపతిరావు వయసు 88. ఫుల్ యాక్టివ్ గా సినిమాల్లో నటిస్తున్నారు. సీనియర్ యాక్టర్స్ అన్నపూర్ణ వయసు 74 సంవత్సరాలు. కొన్ని వందల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.

Advertisement

Also read: కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాడంలో ఎందుకు దూరంగా ఉండాలి..?

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd