• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » “ఖుషి” నుంచి…“శ్రీమంతుడు” వరకు… ఒకే “టైటిల్”తో వచ్చిన తెలుగు సినిమాలు..!

“ఖుషి” నుంచి…“శ్రీమంతుడు” వరకు… ఒకే “టైటిల్”తో వచ్చిన తెలుగు సినిమాలు..!

Published on September 25, 2022 by Bunty Saikiran

Advertisement

టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్ మరియు థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… మూవీకి స్టోరీ ఎంత ముఖ్యమో, టైటిల్ అంతకంటే ముఖ్యం. సినిమా టైటిల్ కోసం దర్శకనిర్మాతలు తల బద్దలు కొట్టుకుంటారు. టైటిల్ విషయంలో అసలు వెనుకడుగు వేయరు.

Tollywood Telugu Movies:

అందుకే మూవీ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ పెట్టేందుకు పాత సినిమాల పేర్లను కూడా వాడుతుంటారు. గతంలో వెండితెరపై సందడి చేసిన టైటిల్, ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడేసి సార్లు కూడా రిపీట్ చేస్తున్నారు. గతంలో ఒకే టైటిల్ తో రెండు సినిమాలు చాలానే తెరకెక్కాయి. కానీ ఇప్పుడు ఒకే టైటిల్ తో మూడు సినిమాలు వస్తున్నాయి. అలా మూడు సినిమాలకు ఒకే టైటిల్ ఉన్న లిస్టు చూస్తే, ఇదేమిటి అబ్బా ఇలా వాడేస్తున్నారు అనుకుంటారు.

‘ఖైదీ’, హీరోగా చిరంజీవి కెరీర్ ను చేంజ్ చేసిన మూవీ. ‘ఖైదీ నెం 150’ అనే సినిమాను కూడా ఆయనే చేశారు. ముచ్చటగా మూడోసారి ఇదే టైటిల్ తో కార్తీ హీరోగా నటించిన, ‘ఖైదీ’ తెలుగు పేక్షకుల్ని అలరించింది. 1986 లో చిరంజీవి హీరోగా ‘రాక్షసుడు’ విడుదలైంది.

2015లో సూర్య నటించిన తమిళ చిత్రం ఇదే పేరుతో తెలుగుపేక్షకుల్ని అలరించింది. ముచ్చటగా మూడోసారి ఈ పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ చేశాడు.

1953 లో ‘దేవదాసు’ మూవీ విడుదలై సంచలనం సృష్టించింది. ‘దేవదాసు’ నే అంటూ 2016లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్. ఇవి రెండు ప్రేమ కథలైతే ఇదే పేరుతో నవ్వులు పంచారు నాగార్జున, నాని. ఒకరు దేవా, మరొకరు దాస్ గా ‘దేవదాస్’ లో సందడి చేశారు.

Advertisement

ఆ తరంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ శ్రీమంతుడు సినిమా, ఈ తరంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు వచ్చింది. అప్పటిలో విక్టరీ వెంకటేష్, ఈ తరంలో నితిన్ శ్రీనివాస కళ్యాణం అనే ఒకే పేరు ఉన్న చిత్రాలకు నటించారు.

మహర్షి పేరుతో తేరకెక్కిన ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

సెన్స్ షేషనల్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఖుషి. విజయ్ దేవరకొండ మరియు సమంత కలిసి నటించిన ఖుషి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక గణేష్ సినిమా కూడా రెండుసార్లు రిపీట్ అయింది. విక్టరీ వెంకటేష్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్… హీరోలుగా రెండుసార్లు గణేష్ సినిమా వచ్చింది.

అలాగే తొలిప్రేమ సినిమా కూడా రెండుసార్లు రిపీట్ అయింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ మరియు వరుణ్ తేజ్ చేయడం విశేషం. లెజెండ్ నందమూరి బాలయ్య మరియు కార్తీ శివకుమార్ విడివిడిగా సుల్తాన్ సినిమాను చేశారు.

 

Advertisement

READ ALSO : వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd