Advertisement
The Life of Muthu Review : తమిళ స్టార్ షింబు తెలుగుపేక్షకులకు సుపరిచితమే. ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి సినిమాలతో తెలుగులోను మంచి క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఇటీవలే ‘మానాడు’ సినిమాతో సూపర్ హిట్ ను సాధించాడు. గత కొంత కాలం నుండి వరస ప్లాప్ లు వెంటాడుతున్న సమయంలో శింబుకు ‘మానాడు’ మంచి కం బ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ‘వెందు తనిందాతు కాదు’ ఒకటి. గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగు లో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో వచ్చింది. రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ టేకింగ్ ప్రత్యేక ఆకర్షణలుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం!

The Life of Muthu Review
కథా మరియు వివరణ:
సొంత ఊర్లో బ్రతకటానికి కష్టపడుతూ తన తల్లి కోసం ముంబై వస్తాడు ముత్తు (శింబు). అయితే తాను పనిచేయడానికి వచ్చిన పరోటా షాపులో పరోటాలు చేయడమే కాదు, బాస్ లు చెబితే హత్యలు కూడా చేయాల్సి వస్తుంది అని లేటుగా తెలుసుకుంటాడు. ఆ కూపం నుండి బయటపడాలనుకునే సమయానికి పరోటా షాపు పై దాడి చేసిన కుట్టి బాయ్ గ్యాంగ్ ను అంతమొందించి, డాన్ కి ఫేవరెట్ బాడీ గార్డ్ గా మారతాడు.
Advertisement
అలా మొదలైన ముత్తు ఎదుగుదల అతడిని డాన్ గా ఎలా మార్చింది అనేది, ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ కథాంశం. శింబు ఫిజికల్ గా బాగా కష్టపడిన అతి తక్కువ సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాతో అతడు చూపిన వేరియేషన్స్, ఎమోషన్ ను డీల్ చేసిన విధానం బాగుంది. నటుడిగా అతని ఎదుగుదలకు ఈ చిత్రం మరో ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే చాలా సెటిల్డ్ గా బయోలెన్స్ ను ఎలివేట్ చేసిన విధానం కూడా సినిమాకి ప్లస్ అయింది. సిద్ధి చూడ్డానికి సమీరా రెడ్డిల ఉండడం ఒక ప్లస్ అయితే, నటించిన సన్నివేశాల్లో మెచ్యూర్డ్ గా కనిపించడం ఇంకో ప్లస్ పాయింట్. అయితే, శింబుతో కెమిస్ట్రీ మాత్రం అంతలా పండలేదు.
ప్లస్ పాయింట్లు:
బలమైన పాత్రలు, సినిమాటోగ్రఫీ, సంగీతం
మైనస్ పాయింట్లు:
రొటీన్ కథాంశం, ఎమోషన్స్ ఆకట్టుకునేలా లేకపోవడం
రేటింగ్: 1.5/5
Advertisement
Read also : ఆ స్టార్ హీరోకు అల్లుడు కావాల్సిన చరణ్… ప్రేమ వ్యవహారం బయటపడటంతో మొత్తం మటాష్!