Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు. అన్నగారు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే బాలకృష్ణ అంటే యాక్షన్ సినిమాలే చాలామందికి తెలుసు. ఆయన సినీ కెరీర్లో ఎక్కువ నటించిన సినిమాలు కూడా యాక్షన్ సినిమాలే.అలాంటి మాస్ హీరో ఒక్కసారిగా క్లాస్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది. ప్రేక్షకులు ఆదరిస్తారా అనే భావనకు బ్రాండ్ అంబాసిడర్ బాలక్రిష్ణ. మాస్ ఇమేజ్ ఉన్న ఆయన ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాలు చేసి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆదిత్య 369 సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రను మరియు మరో వైపు కృష్ణా అనే యువకుడి పాత్రలో నటించడమే కాదు జీవించేశారు.
Advertisement
also read:ANRతో అస్సలు నటించనని తెగేసి చెప్పిన NTR.. వారి మధ్య అంతటి వైరానికి కారణం..!!
Advertisement
అప్పట్లోనే భవిష్యత్తును చూడగల టైం మెషిన్ లో టైం ట్రావెల్ వంటి కాన్సెప్టుతో సినిమా రావడం ఒక సాహసమే అని చెప్పవచ్చు. దీనికి మాస్ ఇమేజ్ వున్న బాలకృష్ణ ఒప్పుకోవడం మరో సాహసం గా చెప్పవచ్చు.. ఇదంతా బాగానే ఉన్నా ఆదిత్య 369 సినిమా అందరం చూసే ఉంటాం. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో 369 అంటే అర్థం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దాని అర్థం ఏంటో బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.. ఆదిత్య అంటే సూర్యుడు అని, 369 అర్థం మాత్రం చెప్పలేదు. 369 అనేది చాలామందికి పాజిటివ్ సంఖ్య. ఎలాగంటే 3+6 కలిపితే 9 వస్తుంది.. ఇక 3 అంటే మార్పు..6 అంటే కొత్త ప్రారంభం, ఇందులో నైన్ అంటే విస్తరించడం అనే అర్థం వస్తుందట.
అందుకే 9 అనేది చాలా మందికి లక్కీ నెంబర్ గా ఉంటుంది. మనం గడియారంలో చూసుకుంటే 369 అనే నెంబర్ కు సమానమైన కాలాన్ని సూచిస్తుంది. అందుకే 369 వెనక ఇంత హిస్టరీ ఉందన్నమాట. అయితే ఈ మూవీ ఇటీవల 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనికి సీక్వెల్ తీస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన బింబిసార మూవీ ఆదిత్య 369 సినిమాకి స్ఫూర్తి అని దర్శకుడు వశిష్ఠ చెప్పడం ఆ మూవీ గొప్పతనాన్ని తెలియజేస్తోంది.