Ads
మనుషులకు అన్నిటికంటే ఎక్కువగా మరణం అంటే భయం. ఎప్పుడు ఎలా మునగడ కోల్పోవలసి వస్తుందో అని ప్రతిక్షణం భయపడుతూ ఉంటారు. చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అది ధనవంతుడైనా, బీదవాడైనా.. ఎవరైనా ఒకటే. పుట్టిన వారు మరణించక తప్పదని అంతటి శ్రీకృష్ణుల వారే మనకి భగవద్గీతలో సెలవిచ్చారు. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చావు రహస్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ కేదర్నాథ్ కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్లుగా, వాటిని యమధర్మరాజు ఉద్ఘాటించినట్లుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాలలో చెప్పబడింది.
Read also: ఎంగేజ్మెంట్ అయ్యాక .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు
Advertisement
ప్రస్తుత సమాజంలో పాపనీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. పురాణ గ్రంథముల ప్రకారం, మరణం మరియు ఆత్మ గురించి రహస్యాలను యముడు చిన్నారి నట్కేట కు చెప్పినట్లుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది. నట్కేట మరణం గురించి యముడు మరణం యొక్క కొన్ని రహస్యాలను బహిర్గతం చేశాడు. ఆ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నట్కేట యముడిని కలిసినప్పుడు అతను మూడు కోరికలను కోరాడు. అతని మొదటి కోరిక అగ్నివిద్య, రెండవది తండ్రి ప్రేమ, మూడవది మరణం మరియు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని మూడు కోరికలను కోరుతాడు. కానీ యముడు ఆఖరి కోరికను తీర్చలేకపోయాడు.
అయితే మనిషికి చెందిన ఐదు చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నట్కేటకు చెప్పిన రహస్యాలు..
1) గ్రంథముల ప్రకారం ఓంకారం పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు
2) యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత వ్యక్తి యొక్క ఆత్మకు మరణం లేదని చెప్పారు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు.
3) ఆత్మ మళ్లీ పుడుతుంది.. ఆత్మకు మరణం లేదు.
4) మనిషి చనిపోయిన తర్వాత అతని పుట్టుక మరియు మరణ చక్రం అంతమవుతుంది. మరణం నుండి బయటపడిన తరువాత అతను బ్రహ్మతో సమానం.
5) కొంతమందికి దేవుని మీద నమ్మకం ఉండదు. చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు.