• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ఎక్కువ కాలం సీఎం గా పనిచేసిన సీఎంలు వీళ్లే!

ఎక్కువ కాలం సీఎం గా పనిచేసిన సీఎంలు వీళ్లే!

Published on August 5, 2022 by Bunty Saikiran

Advertisement

ఒకసారి గెలవడం అంటే అవకాశం, రెండవసారి నిలవడం అంటే నమ్మకం, మూడోసారి పట్టం కట్టారంటే అంతకు మించి అనే కదా? అవును మూడుసార్లు గెలవడం, అధికారాన్ని నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఢిల్లీ లాంటి చోట, దేశ రాజధానిలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే చోట కూడా ఇటువంటి నిర్ణయం వచ్చింది అంటే అది కేజ్రీవాల్ మేజిక్ అని చెప్పాల్సిందే. ఇప్పటివరకు దేశంలో మూడుసార్లు వరుసగా సీఎం అయిన వాళ్లు కేజ్రీవాల్ తో సహా అనేకమంది ఉన్నారు. ఆ లిస్టు ఇప్పుడు చూద్దాం.

Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?

జ్యోతి బసు

జ్యోతి బసు

 

 

జ్యోతి బసు:
దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన కమ్యూనిస్టు నేత జ్యోతిబసు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదు సార్లు పనిచేశారు. బెంగాల్ లో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ నుంచి 1977 నుంచి 2000 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

పవన్ కుమార్ చామ్లింగ్:
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదుసార్లు పనిచేసిన ఘనత చామ్లింగ్ దే. తాను స్థాపించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున 1994 నుంచి 2019 వరకు సుదీర్ఘకాలం పాటు సీఎం గా ఎన్నికయ్యారు పవన్ కుమార్ చామ్లింగ్.

నవీన్ పట్నాయక్:
ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ వరుస విజయాలతో ఉన్నారు. తన తండ్రి ఒడిశా మాజీ సీఎం బిజు పట్నాయక్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని జనతాదళ్ నుంచి బయటకువచ్చి తన తండ్రి పేరుతో బిజు జనతాదళ్ ను స్థాపించారు. వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు.

మాణిక్ సర్కార్:
మాణిక్ సర్కార్, త్రిపుర ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పనిచేశారు. సిపిఎం నుంచి 1998 నుంచి 2018 వరకు వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

శివరాజ్ సింగ్ చౌహన్:
మధ్యప్రదేశ్ కు వరుసగా మూడుసార్లు గెలిచారు శివరాజ్ సింగ్ చౌహన్. 2005 నుంచి 2018 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన.

Advertisement

రమణ సింగ్:
చత్తీస్ గడ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు రమణ సింగ్. 2003 నుంచి 2018 వరకు 15 ఏళ్ల పాటు పనిచేశారు రమణ సింగ్ చత్తీస్ గడ్ కు రెండో ముఖ్యమంత్రిగా అయిన ఆయన బిజెపి ఉపాధ్యక్షునిగా కూడా పనిచేశారు.

నరేంద్ర మోడీ:
వరుసగా దేశానికి రెండు సార్లు ప్రధాని అయినా నరేంద్ర మోడీ, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. 2002, 2007, 2012 ఎన్నికల్లో గెలిచిన మోడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాతి కాలంలో బిజెపి తరపున ప్రధాని అభ్యర్థిగా మారి రెండు సార్లు ప్రధాని అయ్యారు.

తరుణ్ గోగోయి:
కాంగ్రెస్ పార్టీ నుంచి అస్సాం లో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు తరుణ్ గోగోయి. 2001 నుంచి 2016 వరకు పూర్తిస్థాయి సీఎంగా పనిచేశారు. ముఖ్యమంత్రి కాకముందు ఆయన కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.

షీలా దీక్షత్:
ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కంటే ముందు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు షీలా దీక్షత్. 1998 నుంచి 2013 వరకు మూడుసార్లు పూర్తి కాలంతో పాటు సీఎంగా పనిచేశారు ఆమె. 2013 ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చేతిలో ఆమె ఓడిపోయారు.

అరవింద్ కేజ్రీవాల్:
అన్నా హాజారేతో పాటు అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్న కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని వరుసగా మూడోసారి దక్కించుకున్నారు. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన కేజ్రీవాల్ 2013 డిసెంబర్ 28న తొలిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2015లో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచారు. ఇప్పుడు మూడోసారి ఇప్పటికీ అందిన ట్రెండ్స్ ప్రకారం 60కి పైగా స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా, మూడవసారి ముఖ్యమంత్రి అయి హ్యాట్రిక్ కొడుతున్నారు.

మోహన్ లాల్ సుకాడియా రాజస్థాన్ నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున, గోవింద్ బల్లబ్ పంత్ కాంగ్రెస్ నుంచి ఉత్తరప్రదేశ్ కి నాలుగుసార్లు, ఓక్రమ్ సింగ్ మణిపూర్ నుంచి కాంగ్రెస్ తరపున మూడుసార్లు, కామ్ రాజ్ తమిళనాడు తరఫున కాంగ్రెస్ నుంచి మూడుసార్లు, బీమలా ప్రసాద్ అస్సాం నుంచి కాంగ్రెస్ తరపున మూడుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు.

Advertisement

Read Also :  ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd