Advertisement
Tarakaratna: నందమూరి తారకరత్న మరణం అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. చిన్న వయసులోనే తారకరత్న చనిపోవడం చాలా బాధాకరం. దాదాపు 23 రోజులపాటు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో ఒక్కసారిగా తెలుగు ప్రజలందరూ షాక్ కి గురయ్యారు. తారకరత్న గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆయన మరణం తర్వాత తారకరత్న గురించి నందమూరి అభిమానులు విశేషంగా చర్చించుకుంటున్నారు.
Read also: రోహిత్ పై అంపైర్ నితిన్ ప్రేమ.. కోహ్లీపై వివక్ష..!
నిజానికి తారకరత్న కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినప్పటికీ నందమూరి అభిమానులకు ఆయనంటే ఎంతో అభిమానం. ఇదిలా ఉంటే.. తారకరత్న కెరియర్ ప్రారంభంలో రెండు సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నారట. అవేంటంటే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం ఈశ్వర్. ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని తొలుత తారకరత్నతో చేద్దాం అనుకున్నారట. కానీ ఎందుకో చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి చిత్రాన్ని కూడా తొలుత తారకరత్నతోనే చేద్దాం అనుకున్నారట.
Advertisement
కానీ అది కూడా కుదరలేదు. అలా ఆ ఇద్దరి పాన్ ఇండియా సూపర్ స్టార్స్ మొదటి సినిమాలను మిస్ చేసుకుని కెరీర్ లో మంచి సూపర్ హిట్స్ ని అందుకునే అవకాశం కోల్పోయారు నందమూరి తారకరత్న. ఇక ఆయన కన్నుమూశాక దర్శకుడు అనిల్ రావిపూడి.. తాను బాలకృష్ణ తో తెరకెక్కించబోయే చిత్రంలో తారకరత్న కోసం ఓ పాత్రను క్రియేట్ చేశానని, అందుకు బాలకృష్ణ కూడా ఎంతో సంతోషించారని చెప్పారు. అలాగే ప్రభాస్ తో తాము నిర్మిస్తున్న భారీ చిత్రం ” ప్రాజెక్ట్ కె” లో కూడా తారకరత్నకు ఓ కీలకపాత్ర ఇవ్వాలని భావించామని నిర్మాత అశ్విని దత్ పేర్కొన్నారు.
Advertisement
Read also: Telugu News, Tollywood Movie News in Telugu