• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » దీపావళికి విడుదల అవుతున్న తెలుగు సినిమాల లిస్ట్ ఇదే !

దీపావళికి విడుదల అవుతున్న తెలుగు సినిమాల లిస్ట్ ఇదే !

Published on October 13, 2022 by karthik

Advertisement

దీపావళి పండుగ సందర్భంగా సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచడానికి 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 20 రోజుల గ్యాప్ తో వరుసగా దసరా, దీపావళి పండుగలు.. సెలవులతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దసరా కానుకగా పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేయగా.. ఇప్పుడు దీపావళి కోసం మరిన్ని సినిమాలు క్యూ కట్టాయి. అవేంటో చూద్దాం.. హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ నటించిన చిత్రం ” బ్లాక్ ఆడెమ్”. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సింది. అయితే కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని డిసి ఫిలిమ్స్, సెవెన్ బక్స్ ప్రొడక్షన్స్, మరియు ఫ్లిన్ పిక్చర్ కో సంయుక్తంగా నిర్మించాయి. jaume collet- serra ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇక మరో చిత్రం డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “జిన్నా”. ఈ సినిమా ద్వారా సూర్య డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించగా.. అనుప్ రూబిన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం అక్టోబర్ 21న రిలీజ్ కానుంది.

Advertisement

ఇక “ఓరి దేవుడా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్ సేన్. తమిళంలో సూపర్ హిట్ అయిన “ఓ మై కడువలే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మరిమత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటిస్తున్నారు. వంశీ నిర్మాతగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఇక యంగ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్నాజా చిత్రం “ప్రిన్స్”. ఈ సినిమాని జాతి రత్నాలు చిత్ర దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో శివ కార్తికేయన్ సరసన మరియా రాబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకులను అలరించనుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు కార్తీ. ” సర్దార్” సినిమాతో అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి పి.ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా.. రాశిఖన్నా, రజియా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు.

ఇక మరో చిత్రం అక్షయ్ కుమార్, సత్యదేవ్, జాక్వలిన్ ఫెర్నాన్డేజ్ ప్రధాన తారాగణంగా రూపొందించిన “రామసేతు”. దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ ఆరు సినిమాలు దీపావళి పండుగకి ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.

 

Advertisement

READ ALSO : కమల్ హాసన్ నుంచి ప్రభాస్ : 2022లో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న 10 హీరోలు !

Latest Posts

  • కలెక్టర్ అయ్యుండి పెళ్లికి కట్నం అడిగాడు..ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..?
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 02.02. 2023
  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇందులో ఎన్ని హిట్ అంటే ?
  • నర్సుతో డాక్టర్ ప్రేమాయణం, పెళ్లి.. కానీ రెండేళ్లు గడవకముందే..!!
  • ఇప్పటి దాకా మీరెప్పుడు చూడని నందమూరి తారక రత్న భార్య పిల్లల ఫొటోస్ ఇవి ఇప్పటి దాక చూసుండరు !

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd