• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » ఢిల్లీలో కోదండరాం.. సర్కారుపై సమరం

ఢిల్లీలో కోదండరాం.. సర్కారుపై సమరం

Published on January 29, 2023 by Idris

Ads

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. విభజన హామీలు, కృష్ణా జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ లో మౌన దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. సుమారు 150 మందితో గంటపాటు ఈ దీక్ష చేపడతామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీ కోసమే తాను ఈ దీక్ష చేస్తున్నట్టు వివరించారు.

జనవరి 31న కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పాలన అభివృద్ధి వాస్తవాలు అనే అంశంపై కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ లో సెమినార్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు కోదండరాం. తెలంగాణ ఏర్పడక ముందు ఏ సమస్యలు ఉన్నాయో నేటికీ అవే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకుని భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత రాష్ట్ర సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని కేసీఆర్ పై మండిపడ్డారు.

Advertisement

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తికావొస్తున్నా నేటికీ ఆస్తుల పంపకాలు, సంస్థల విభజన పూర్తికాలేదని అన్నారు కోదండరాం. ఢిల్లీలో తెలంగాణ , తెలుగు ప్రజలు తమ దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. కృష్ణా నదీ జలాల్లో 170 టీఎంసీలు, 22 శాతం నీటి వాటా మాత్రమే తెలంగాణకు దక్కిందన్న ఆయన.. ప్రస్తుతం ఉన్న నీటివాటాతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడం వల్ల వాటికి అనుమతులు లభించడం లేదని వివరించారు.

అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణం చేయొద్దని కేంద్రం గెజిట్ జారీ చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు కోదండరాం. సెమినార్ కార్యక్రమానికి యోగేంద్ర యాదవ్ లాంటి చాలామంది వక్తలు వస్తున్నారని.. కేసీఆర్ పాలన మిగిల్చిన నష్టంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు.

Related posts:

అయ్యయ్యో.. బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంతటి కష్టమొచ్చింది..! ఇది ఆగని యుద్ధం.. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ komatireddy meets pm modiమోడీతో కోమటిరెడ్డి భేటీ.. ఫుల్ డీటెయిల్స్..! Komatireddy Rajagopal Reddy Counter To Revanth Reddyరాజకీయ వ్యభిచారి అంటూ రేవంత్ పై మండిపడ్డ కోమటిరెడ్డి

Advertisement

Latest Posts

  • హైదరాబాద్ లో బస చేస్తున్న పాక్ టీం కి ఫుడ్ మెనూ ఏంటో తెలుసా ? ఫుడ్ మెనూ లో అది లేకపోవడం చూసి షాక్ అయిన పాక్ఆటగాళ్లు !
  • చంద్రబాబుకి జగన్ ప్రభుత్వం మరో షాక్.. సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్..!
  • భువనేశ్వరి ఆస్తి విలువ అన్ని కోట్లా..? 2 శాతం విలువ చెప్పి చిక్కుల్లో పడిందా ?
  • మీకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!
  • గాయాలేమీ లేవా? భవ్యశ్రీ కేసులో పోలీసులు చెప్పిన నిజాలు ఏంటంటే?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd