Ads
Tollywood Best Top 10 Comedy Movies: అసలు గత దశాబ్దంలో టాలీవుడ్ హిస్టరీని గమనిస్తే, బాహుబలి తర్వాత ఆర్ ఆర్ ఆర్, పుష్ప లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో పాటు కార్తికేయ 2 లాంటి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అయినా కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మార్కెట్ ఉన్న బడా హీరోలు మాత్రం ఎక్కువగా రీమేక్స్ వైపే చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా, మన తెలుగు సినిమాల విషయంలో కామెడీ సినిమాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. మన తెలుగులో కొన్ని సినిమాల పేరు వింటేనే అభిమానులు, ప్రేక్షకులు నవ్వే పరిస్థితి ఉంటుంది అనే మాట వాస్తవం. దర్శకులు సినిమాలను అలా అందించారు మరి. అసలు మనకు బాగా కామెడీ పంచిన సినిమాలు ఏవో చూద్దాం.
Read also: చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆమె కాళ్లు పట్టుకున్నాడట.. ఏం జరిగిందంటే?
Tollywood Best Top 10 Comedy Movies
పెళ్లి చూపులు:
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమా ఈ తరానికి మంచి కామెడీ సినిమా. విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా. ఈ సినిమాలో ప్రియదర్శి మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ప్రతి మాట కూడా ఆకట్టుకుంటుంది.
చంటబ్బాయి:
జంధ్యాల దర్శకత్వంలో, చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి పాత్రే కామెడీగా ఉంటుంది. ఈ సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ఎన్నిసార్లు చూసినా అందంగానే ఉంటాయి.
ఏప్రిల్ 1 విడుదల :
నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించగా, ఈ సినిమాలు గోదావరి యాస్ చాలా బాగా ఆకట్టుకుంది.
Advertisement
ఆ ఒక్కటి అడక్కు:
రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా సినిమాను ఊపేసింది. ఎల్బీ శ్రీరామ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి ఈ సినిమాలో.
మన్మధుడు:
నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయభాస్కర్ ద్వయం చేసిన మరో ఉల్లాసమైన ప్రయత్నం ఇది. ఈ సినిమాలో నాగార్జునకు అమ్మాయిలు అంటే కోపం.
నువ్వు నాకు నచ్చావు:
విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో కామెడీ చాలా అందంగా ఉంటుంది. ఈతరమే కాదు వచ్చేతరం కూడా ఈ సినిమాను ఇష్టపడుతుంది. ప్రతి పాత్ర కూడా మనకు హాస్యాన్ని ఇస్తుంది.
చిత్రం భళారే విచిత్రం:
ఈ సినిమా హీరో నరేష్ కామెడీ చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. ఆయన నటన చూస్తే నవ్వే వారు ప్రేక్షకులు. లేడీ అవతారంలో నరేష్ పాత్ర బాగుంటుంది. నరేష్, మహర్షి రాఘవ, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ బ్యాచ్ మీకు మంచి హాస్యాన్ని ఇస్తుంది.
మాయాబజార్:
ఆ తరమైన ఈ తరమైన సరే ఈ సినిమా నచ్చని వాళ్ళు ఉండరు. కేవీరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ నటులు ఎన్టీఆర్, సావిత్రి, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు ఈ చిత్రంలో తమ పాత్రలకు న్యాయం చేశారు.
READ ALSO : ఛీటింగ్ చేసి..గెలిచిందని టీమిండియాపై ట్రోలింగ్… దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్